టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) కెరీర్ లో చాలా స్పెషల్ సినిమా అయిన ఖలేజా(Khaleja4K Re Release) సినిమాను ఈ నెల ఎండ్ లో గ్రాండ్ గా రీ రిలీజ్ చేయబోతూ ఉండగా…సినిమా మీద ఆడియన్స్ లో ఊహకందని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి…ఆల్ మోస్ట్ ఒక కొత్త సినిమా రిలీజ్…
అయ్యే టైంలో ఉండే హడావుడి బుకింగ్స్ లో ఏర్పడగా రెండు రోజుల్లోనే 90 వేలకు పైగా టికెట్ సేల్స్ ను బుక్ మై షో లో సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోస్తూ దూసుకు పోతూ ఉండగా…గ్రాస్ బుకింగ్స్ లెక్క ఆల్ రెడీ 2.5 కోట్లకి పైగా జరిగింది… ఇక నార్త్ అమెరికాలో కూడా…
20 వేల డాలర్స్ ని అందుకుని రచ్చ లేపిన ఈ సినిమా రిలీజ్ రోజు వరకు మరింత జోరు చూపే అవకాశం కనిపిస్తూ ఉండగా కచ్చితంగా మొదటి రోజు వసూళ్ళ పరంగా టాలీవుడ్ రీ రిలీజ్ రికార్డులను అన్నింటీనీ కూడా బ్రేక్ చేసే అవకాశం సినిమాకి…
ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…ఇక సౌత్ లో బిగ్గెస్ట్ రీ రిలీజ్ డే 1 కలెక్షన్స్ రికార్డ్ ను నమోదు చేసిన దళపతి విజయ్(Thalapathy vijay) నటించిన మహేష్ బాబు(Mahesh Babu) ఒక్కడు(Okkadu Movie) తమిళ్ రీమేక్ గిల్లి(Ghilli Re Release) మొదటి రోజు కలెక్షన్స్ రికార్డ్ అయిన…
7.92 కోట్ల గ్రాస్ రికార్డ్ ను టార్గెట్ చేసే అవకాశం ఎంతైనా ఉంది. ఇంకా రిలీజ్ కి 5 రోజుల టైం ఉండటం, బుకింగ్స్ ట్రెండ్ ఇప్పటికీ సూపర్ సాలిడ్ గా కొనసాగుతూ ఉండటంతో ఖలేజా కి గిల్లి మొదటి రోజు కలెక్షన్స్ ని టార్గెట్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి..
కానీ ఓవర్సీస్ లో గిల్లి మూవీ 3 కోట్లకు పైగా గ్రాస్ ను మొదటి రోజున అందుకుంది. ఖలేజా సినిమా కూడా ఇదే రేంజ్ లో జోరు కనుక చూపిస్తే కచ్చితంగా ఈ సినిమా డే 1 ని అందుకునే ఛాన్స్ ఉంటుంది. మరి సినిమా రీ రిలీజ్ లలో ఏ రేంజ్ లో భీభత్సం సృష్టిస్తుందో చూడాలి ఇప్పుడు.