Home న్యూస్ ఎవ్వరూ కొట్టలేదు….ఇక 24.85ని నానే కొడతాడా…లేదా!!

ఎవ్వరూ కొట్టలేదు….ఇక 24.85ని నానే కొడతాడా…లేదా!!

0
Nani SARIPODHAA SANIVAARAM Day1 Box Office Gross Target
Nani SARIPODHAA SANIVAARAM Day1 Box Office Gross Target

టాలీవుడ్ లో టాప్ స్టార్స్ రేంజ్ ఓపెనింగ్స్ భారీ లెవల్ లో ఉండగా ఇప్పటికీ మీడియం రేంజ్ హీరోలు ఆ ఓపెనింగ్స్ ను అందుకోవడం లేదు, కానీ అప్పుడప్పుడు కొందరు మంచి స్టార్ట్ ను బాక్స్ అఫీస్ దగ్గర సొంతం చేసుకుంటున్నా కూడా ఓవరాల్ గా చూసుకుంటే టాప్ స్టార్స్ రేంజ్ ఓపెనింగ్స్ ఇప్పట్లో అందుకోవడం కూడా కష్టంగానే ఉండగా…

టైర్ 2 హీరోల పరంగా ఫస్ట్ డే హైయెస్ట్ కలెక్షన్స్ ని అందుకున్న హీరోలలో నాచురల్ స్టార్ నాని(Nani) ఒక్కడే బెటర్ గా కన్సిస్టంట్ గా దూసుకు పోతున్నాడు… లాస్ట్ ఇయర్ నాని నటించిన ఊరమాస్ మూవీ అయిన దసరా టాలీవుడ్ లో టైర్2 హీరోల సినిమాల పరంగా…

బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 14.22 కోట్ల షేర్ ని 24.85 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించగా తర్వాత మీడియం రేంజ్ హీరోలు ఎవ్వరూ కూడా ఈ ఓపెనింగ్స్ ను అసలు అందుకోలేక పోయారు….

విజయ్ దేవరకొండ 2 సినిమాలతో వచ్చినా పెద్దగా అంచనాలను అందుకోలేదు, రామ్ కూడా రెండు ఊరమాస్ సినిమాలతో వచ్చినా ఇంపాక్ట్ ఏమి చూపించలేదు. మిగిలిన మీడియం రేంజ్ హీరోలు ప్రస్తుతం ఫామ్ లో లేరు… ఇక ఇలాంటి టైం లో తను నెలకొల్పిన రికార్డ్ ను ఇప్పుడు తిరిగి…

తానె బ్రేక్ చేయడానికి సిద్ధం అయ్యాడు నాని… తను నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం(SARIPODHAA SANIVAARAM Movie) మంచి హైప్ నడుమ ఈ నెల ఎండ్ లో రిలీజ్ కాబోతూ ఉండగా…. ఆల్ రెడీ ఆగస్టు 15 వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాలు అట్టర్ ఫ్లాఫ్ అవ్వడంతో…

థియేటర్స్ అన్నీ కూడా ఖాళీ అయిపోయాయి…దాంతో ఆగస్టు 29న మంచి హైప్ నడుమ వస్తున్న సరిపోదా శనివారంకి కావలసినన్ని థియేటర్స్ ఉండగా హైప్ కూడా బాగుండటంతో దసరా డే 1 ని నాని తానే టార్గెట్ చేసే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. మరి తన రికార్డ్ ను నానే కొడతాడో లేదో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here