Home న్యూస్ ఈ టైం లో ఈ సినిమా….రికార్డుల జాతర ఖాయం…కానీ!!

ఈ టైం లో ఈ సినిమా….రికార్డుల జాతర ఖాయం…కానీ!!

0

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) రాజకీయాల్లో చరిత్ర సృష్టించాడు….భారీ మెజారిటీతో MLA గా గెలవడమే కాదు తన పార్టీ ఏకంగా పోటి చేసిన ప్రతీ చోట విజయాన్ని సొంతం చేసుకుని ఇండియాలో ఏ పార్టీ సాధించని 100% సక్సెస్ రేట్ ను సొంతం చేసుకుని ఎపిక్ రికార్డ్ ను నమోదు చేశాడు…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గేమ్ చేంజర్ గా నిలిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాజకీయాల్లో మరింత బిజీ అవ్వబోతున్నాడు….ఇలాంటి టైంలో సినిమాల పరంగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలు చాలానే సెట్స్ మీద ఉండగా వాటిలో ఆడియన్స్ ముందుకు ముందుగా OG – They Call Him OG సినిమాతో రావాల్సి ఉంది…

ఈ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ ను అనౌన్స్ చేశారు…కానీ పొలిటికల్ హీట్ వలన సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ముందుగా ఏ సినిమా సెట్స్ లో అడుగు పెడతాడు అన్నది ఆసక్తిగా మారగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ అచీవ్ చేసిన రికార్డుల తర్వాత థియేటర్స్ లో మాత్రం OG సినిమా పెర్ఫెక్ట్ గా ఫ్యాన్స్ కి ఫుల్…

ఖుషి చేసే సినిమా అయ్యే అవకాశం ఉందని చెప్పాలి. ప్రస్తుతం ఆంధ్ర లో ఉన్న హైప్ కి ఈ సినిమా వస్తే అన్ని చోట్లా రికార్డుల ఊచకోత కోసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లో కొంచం లేట్ గా ఎంటర్ అయ్యే అవకాశం ఉండగా అదే టైంలో ఈ ఇయర్ లో మేజర్ OTT స్లాట్స్ అన్నీ ఫుల్ అవ్వడం వలన….

OG సినిమా 2025 ఇయర్ కి వెళ్ళింది అంటున్నారు. దాంతో హరిహర వీరమల్లు ఇయర్ ఎండ్ లో రిలీజ్ కావొచ్చు అంటున్నారు.. కానీ ఇప్పుడున్న ఊపులో OG వస్తే మాత్రం రికార్డుల బెండు తీసేది… మరి పవన్ కళ్యాణ్ కొంచం ఆ సినిమా వైపు కాన్సన్ ట్రేట్ చేస్తే మాత్రం ఫ్యాన్స్ ఆనందం మరో లెవల్ కి వెళ్ళడం ఖాయం….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here