హాలీవుడ్ లో 2020 ఇయర్ లో మోస్ట్ వాంటెడ్ మూవీస్ లో ఒకటైన వండర్ వుమన్ 2 పై అంచనాలు తారా స్థాయిలో ఉండేవి, మొదటి పార్ట్ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం తో రెండో పార్ట్ పై అంచనాలు భారీగా ఉండగా సినిమా పై ఇండియా లో కూడా క్రేజ్ సాలిడ్ గా ఏర్పడింది… సినిమా కోవిడ్ పరిస్థితుల నేపధ్యంలో అటు థియేటర్స్ లో ఇటు డిజిటల్ గా రెండు చోట్లా…
రిలీజ్ ను ఒకేసారి సొంతం చేసుకోగా ఇండియా లో మాత్రం సినిమా రెండు రోజుల ముందుగా రిలీజ్ అవ్వగా ప్రీమియర్ షోలు మొదటి రోజు మంచి వసూళ్ళని సాధించిన ఈ సినిమా టాక్ మాత్రం యావరేజ్ లెవల్ లో ఉండటం తో పెద్దగా లాంగ్ రన్ ని సొంతం చేసుకోలేక…
పరుగును త్వరగానే ముగించాల్సి వచ్చింది. సినిమా 2 రోజుల్లోనే 4.5 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా తర్వాత టాక్ స్ప్రెడ్ అవ్వడం తో స్లో డౌన్ అయిన సినిమా మొదటి వారంలో 12 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.
ఇక ఇప్పుడు పరుగు పూర్తీ అయ్యే టైం కి టోటల్ గా 18 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని పరుగును కంప్లీట్ చేసుకుంది ఈ సినిమా.. మొత్తం మీద టాక్ కొంచం యావరేజ్ గా ఉన్నప్పటికీ కూడా సినిమా మంచి కలెక్షన్స్ నే ఇండియా లో సొంతం చేసుకుంది అని చెప్పాలి. వరల్డ్ వైడ్ గా మాత్రం సినిమా ఏమాత్రం ఇంప్రెస్ చేయలేక పోయింది అని అంటున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో సినిమా…
మొత్తం మీద 1.8 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. నార్మల్ టైం లో రిలీజ్ అయ్యి ఉంటె ఇంకా బెటర్ కలెక్షన్స్ నే సొంతం చేసుకునే అవకాశం ఉండేది కానీ థియేటర్స్ రీ ఓపెన్ అయ్యాక రిలీజ్ అయిన ఈ సినిమా మొత్తం మీద పెర్సేంటేజ్ బేస్ మీద రిలీజ్ అవ్వడం తో నష్టాలు లేకుండా మంచి కలెక్షన్స్ తో పరుగును ముగించింది.