మూడేళ్ళ క్రితం వచ్చిన వండర్ వుమన్ బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని సాధించగా ఇండియా లో కూడా దుమ్ము లేపే రేంజ్ లో వసూళ్ళ ని సొంతం చేసుకుంది, ఇక సినిమా కి సీక్వెల్ గా వచ్చిన రెండో పార్ట్ ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా కానీ సినిమా కరోనా వలన పోస్ట్ పోన్ అవుతూ రాగా ఎట్టకేలకు థియేటర్స్ లో అలాగే డిజిటల్ లో ఒకేసారి రిలీజ్ అవ్వాలని ఫిక్స్ అయిన సినిమా క్రిస్టమస్ కానుకగా రిలీజ్ అయింది.
ఇండియా లో కూడా సినిమా బాగానే రిలీజ్ ను సొంతం చేసుకోగా సినిమా 23 న పెయిడ్ ప్రీమియర్స్ ని వేయగా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సినిమా తర్వాత మొదటి రోజు అలాగే రెండో రోజు అయిన క్రిస్టమస్ న కూడా దుమ్ము లేపే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…
సినిమా పెయిడ్ ప్రీమియర్ షోలకు 90 లక్షల నెట్ కలెక్షన్స్ ని ఇండియా లో సొంతం చేసుకోగా… మొదటి రోజు ఇండియా లో 1.5 కోట్ల దాకా నెట్ కలెక్షన్స్ ని సాధించింది. ఇక రెండో రోజు క్రిస్టమస్ హాలిడే ని ఎంజాయ్ చేసిన సినిమా సౌత్ లో సోలో బ్రతుకే సో బెటర్ నుండి పోటి ని తట్టుకుని కూడా..
మొత్తం మీద ఇండియా లో 2 వ రోజున వండర్ వుమన్ 2 సినిమా 2.1 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుందని సమాచారం…. దాంతో టోటల్ గా పెయిడ్ ప్రీమియర్స్ అండ్ 2 డేస్ కలెక్షన్స్ కలిపి టోటల్ గా 4.5 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది… డిజిటల్ రిలీజ్ కూడా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవడం మాత్రం…
ఊరమాస్ అనే చెప్పాలి. ఈ లెక్కన వీకెండ్ ని అవలీలగా 8 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి, అదే నార్మల్ రిలీజ్ అయ్యి ఉంటె అవలీలగా సినిమా 20 కోట్ల రేంజ్ కలెక్షన్స్ ని అందుకుని ఉండేది కానీ ప్రస్తుత పరిస్థితులలో ఇవి సాలిడ్ ఓపెనింగ్స్ అనే చెప్పాలి.