Home న్యూస్ రైటర్ పద్మభూషణ్ మూవీ రివ్యూ..రేటింగ్!!

రైటర్ పద్మభూషణ్ మూవీ రివ్యూ..రేటింగ్!!

0

కలర్ ఫోటో సినిమా డిజిటల్ లో రిలీజ్ అయినా నటుడిగా అద్బుతమైన పేరుని సొంతం చేసుకున్న సుహాస్ తర్వాత అడపాదడపా సినిమాల్లో తన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటూ వస్తూ ఉండగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు రైటర్ పద్మభూషణ్ అంటూ మరో కొత్త సినిమాతో వచ్చేశాడు. టీం సినిమాను యూనిక్ వే లో ప్రమోషన్స్ బాగానే చేసి సినిమాను ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకు రాగా ఉన్నంతలో మంచి రిలీజ్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఎలా ఉంది ఎంతవరకు మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…

   

ముందుగా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే గొప్ప రైటర్ అవ్వాలని అనుకునే హీరో తన ఫ్యామిలీతో విజయవాడలో ఉండగా ఒక లైబ్రరీలో జాబ్ చేస్తూ ఉంటాడు. ఒక బుక్ కూడా రాసి పబ్లిష్ చేస్తాడు కానీ ఎవ్వరూ కొనరు, అలాంటి తన లైఫ్ లో హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది, తర్వాత లైఫ్ లో ఊహించని పరిణామాలు ఎదురు అయ్యి కొన్ని అనుకోని ట్విస్ట్ లు కూడా ఎదురు అవుతాయి. మరి హీరో వీటి నుండి ఎలా బయటపడ్డాడు తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…

కథ స్టార్ట్ అవ్వడం చాలా నార్మల్ గా స్టార్ట్ అవ్వగా స్క్రీన్ ప్లే కొంచం నీరసంగానే సాగుతుంది, హీరో లవ్ స్టొరీ కూడా జస్ట్ ఓకే అనిపించేలానే ఉండగా కామెడీ ట్రై చేసినా కొన్ని సీన్స్ కే వర్కౌట్ అయింది. సాదాసీదాగా సాగుతున్న ఫస్టాఫ్ ఇంటర్వెల్ ఎపిసోడ్ తో మంచి ఆసక్తిని క్రియేట్ చేయగా సెకెండ్ ఆఫ్ మాత్రం బాగా మెప్పిస్తుంది, కామెడీ, ఎమోషన్, క్లైమాక్స్ సీన్స్ అన్నీ బాగుండటంతో ఫస్టాఫ్ యావరేజ్ గా ఉన్నా సెకెండ్ ఆఫ్ ఇచ్చిన మంచి ఇంప్రెషన్ తో ఫస్టాఫ్ ను మర్చిపోతాం…. 

హీరోగా సుహాస్ మరోసారి తన నటనతో మెప్పించగా తన పెర్ఫార్మెన్స్ సినిమాలో మెయిన్ హైలెట్ గా నిలిచింది, హీరోయిన్స్ జస్ట్ ఓకే, ఆశిష్ విద్యార్ధి కామెడీ బాగుంది, రోహిణి పెర్ఫార్మెన్స్ కూడా బాగా మెప్పించగా మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు. సంగీతం సినిమా కి తగ్గట్లు మెప్పించింది, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ మరింత టైట్ గా ఉండేలా చూసుకుంటే బాగుండేది, అలాగే సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ఎందుకో కొన్ని షాట్స్ క్వాలిటీ పరంగా మెప్పించలేదు, షార్ట్ ఫిలిమ్స్ క్వాలిటీలో ఉన్నాయి… ఇక డైరెక్షన్ విషయానికి వస్తే షణ్ముక్ ప్రశాంత్ ఎంచుకున్న పాయింట్ బాగుండటంతో కొన్ని ఫ్లాస్ ఉన్నప్పటికీ కూడా…

రైటర్ పద్మభూషణ్ చాలా వరకు ఎంగేజింగ్ గా సాగి ఎక్కువ భాగం మెప్పిస్తుంది, ఫస్టాఫ్ కొంచం యావరేజ్ గా ఉన్నా సెకెండ్ ఆఫ్ ఆసక్తిగా సాగడంతో ఆడియన్స్ సినిమా ఎండ్ అయ్యే టైంకి ఓ మంచి సినిమానే చూసిన ఫీలింగ్ తో థియేటర్స్ బయటికి రావడం ఖాయం…ఫస్టాఫ్ పై ఇంకా ఎక్కువ శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా ఇంకా బాగుండేది…. ఓవరాల్ గా పెద్దగా అంచనాలు ఏమి లేకుండా థియేటర్స్ కి వెళ్ళే ఆడియన్స్ ను సినిమా ఎండ్ అయ్యే టైంకి మంచి సినిమా అనిపించడం ఖాయం… ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.75 స్టార్స్….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here