టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కి ముందు రిలీజ్ అయిన 2 సినిమాలు ఆచార్య మరియు గాడ్ ఫాదర్ సినిమాలు బాక్ టు బాక్ రిలీజ్ అయ్యి కలెక్షన్స్ పరంగా అంచనాలను అందుకోలేక నిరాశ పరిచిన విషయం తెలిసిందే. ఇలాంటి టైంలో భారీ ప్రెషర్ నడుమ రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య సినిమా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచి మెగాస్టార్ కెరీర్ లో భారీ లాభాలను సొంతం చేసుకుంది.
ఇంతటి భారీ విజయాన్ని నమోదు చేసిన ఈ సినిమా కి ఓవరాల్ గా మెగాస్టార్ చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతవరకు తీసుకున్నాడు అన్నది ఆసక్తిగా మారగా బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ పడ్డా కానీ భారీ రెమ్యునరేషన్ నే సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి ఇప్పుడు…
ఈ సినిమా కన్నా ముందు చేసిన సినిమాలు ఓన్ ప్రొడక్షన్ హౌస్ లోనే చేయగా ఆ సినిమాలకు వాల్యూ రెమ్యునరేషన్ రేంజ్ 40-45 కోట్ల దాకా ఉందని అంచనా. ఇప్పుడు వాల్తేరు వీరయ్య సినిమా కి మాత్రం ఏకంగా 50 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని….
మెగాస్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది… బాక్ టు బాక్ ఫ్లాఫ్స్ పడ్డా కానీ ఈ రేంజ్ లో రికార్డ్ రెమ్యునరేషన్ ని సొంతం చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు. సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యంత భారీ లాభాలను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపింది.