టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మాస్ మహారాజ్ రవితేజ ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న సినిమా వాల్తేరు వీరయ్య… ఇప్పుడు ఆల్ మోస్ట్ బాక్స్ ఆఫీస్ రన్ ఎండ్ స్టేజ్ కి వచ్చేయగా త్వరలో డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఈ సినిమాకి డిజిటల్ రైట్స్ భారీ రేటుని సొంతం చేసుకోగా తర్వాత సినిమా టెలివిజన్ రైట్స్ కూడా….
మరీ భారీ లెవల్ లో కాకున్నా కానీ వరుస ఫ్లాఫ్స్ ఎఫెక్ట్ ఉన్నా కూడా మెగాస్టార్ కి మెగా కంబ్యాక్ అనిపించే రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపింది. సినిమా శాటిలైట్ రైట్స్ కోసం స్టార్ మా మరియు జెమినీ టీవీ లు పోటీ పడగా….
మొత్తం మీద జెమినీ టీవీ ఫైనల్ గా సినిమా శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకోగా ఏకంగా సినిమా కోసం 16 కోట్ల రేంజ్ లో రేటు చెల్లించి సినిమా హక్కులను దక్కించుకోవడం విశేషం అని చెప్పాలి. నాన్ థియేట్రికల్ రైట్స్ తో అల్టిమేట్ రిటర్న్స్ ను సొంతం చేసుకున్న వాల్తేరు వీరయ్య…
2 బాక్ టు బాక్ థియేట్రికల్ ఫ్లాఫ్స్ పడ్డా మెగాస్టార్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని మరోసారి నిరూపించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఊహకందని ప్రాఫిట్స్ తో మెగాస్టార్ కెరీర్ లో హైయెస్ట్ ప్రాఫిటబుల్ మూవీ గా ఈ సినిమా నిలిచిన విషయం అందరికీ తెలిసిందే.