Home న్యూస్ మాస్టర్ వరల్డ్ వైడ్ బిజినెస్…అడ్వాన్స్ బుకింగ్స్ రిపోర్ట్….ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత రావోచ్చంటే!

మాస్టర్ వరల్డ్ వైడ్ బిజినెస్…అడ్వాన్స్ బుకింగ్స్ రిపోర్ట్….ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత రావోచ్చంటే!

1377
0

కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మాస్టర్ బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యంత భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా సినిమా వరల్డ్ వైడ్ గా 2300 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా సినిమా తెలుగు రాష్ట్రాలలో 700 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వబోతుంది. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ రివీల్ అయింది.

సినిమా తమిళనాడు లో 62.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా, తెలుగు రాష్ట్రాలలో 8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది, ఇక కర్ణాటక లో 6 కోట్ల బిజినెస్ ను, కేరళలో 4.15 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా హిందీ డబ్బింగ్ వర్షన్ మొత్తం మీద…

4 కోట్ల బిజినెస్ ను సాధించగా సినిమా 15 న హిందీ వర్షన్ రిలీజ్ కానుంది. ఇక సినిమా రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద 1.1 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా అమెరికాలో 3.5 కోట్ల బిజినెస్ ను సాధించింది. ఇక రెస్ట్ ఆఫ్ వరల్డ్ టోటల్ గా 15 కోట్ల బిజినెస్ ను…

సాధించిన మాస్టర్ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా ఇప్పుడు 104.25 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే 190 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సాధించాల్సి ఉంటుంది. ఇక సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయే రేంజ్ లో రెండు తెలుగు రాష్ట్రలలో తమిళ్ లో కర్ణాటక లో జరుగుతూ ఉన్నాయి.

ఓవర్సీస్ లో కూడా అదిరిపోయే లెవల్ లో ఉండటం తో మొదటి రోజు తెలుగు లో 2.5 కోట్లకు తగ్గని షేర్ ని, తమిళ్ లో 18 కోట్ల రేంజ్ గ్రాస్ ని ఇండియా లో 30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని మినిమమ్ సొంతం చేసుకునే  అవకాశం ఉంది. ఇక టాక్ ని బట్టి ఈ లెక్క ఎంతవరకు వెళుతుంది అన్నది చెప్పగలం. చూడాలి ఇక సినిమా బాక్స్ ఆఫీస్ ఊచకోత ఎలా ఉంటుందో అని…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here