లెజెండ్రీ డైరెక్టర్ మణిరత్నం డైరెక్షన్ లో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్ మరియు త్రిష లాంటి భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ పొన్నియన్ సెల్వన్ సిరీస్ లో భాగంగా ఆడియన్స్ ముందు పార్ట్ 1 శుక్రవారం భారీ ఎత్తున రిలీజ్ అవుతూ ఉండగా సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 10 కోట్ల రేంజ్ లో వర్త్ బిజినెస్ ను సొంతం చేసుకోగా మిగిలిన చోట్ల సినిమా…
టోటల్ బిజినెస్ లెక్కలు ఏవి కూడా అఫీషియల్ గా రివీల్ చేయలేదు కానీ ట్రేడ్ లెక్కల్లో అంచనా బిజినెస్ లెక్కలు ట్రేడ్ లో చక్కర్లు కొడుతూ ఉండగా ఆ లెక్క ప్రకారం పొన్నియన్ సెల్వన్ పార్ట్ 1 సినిమా బిజినెస్ లెక్కలను గమనిస్తే…
సినిమా తమిళనాడు లో మొత్తం మీద 65 కోట్ల రేంజ్ లో వర్త్ బిజినెస్ ను సొంతం చేసుకుందని అంచనా… ఇక తెలుగు రాష్ట్రాలలో 10 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను అందుకున్న ఈ సినిమా… హిందీలో కర్ణాటకలో, కేరళలో అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద సినిమా 20 కోట్ల రేంజ్ లో వర్త్ బిజినెస్ ను సొంతం చేసుకుందని అంచనా….
దాంతో సినిమా టోటల్ ఇండియా బిజినెస్ లెక్క అటూ ఇటూగా 95 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా… ఇక ఓవర్సీస్ లో సినిమా బిజినెస్ రేంజ్ 35 కోట్ల రేంజ్ దాకా ఉంటుందని అంటున్నారు… దాంతో సినిమా టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క 130 కోట్ల దాకా ఉంటుందని అంచనా…. దాంతో సినిమా మొత్తం మీద ఇప్పుడు….
క్లీన్ హిట్ అవ్వాలి అంటే వరల్డ్ వైడ్ గా 260 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అఫీషియల్ బిజినెస్ లో ఏమైనా మార్పులు ఉంటె అప్ డేట్ చేస్తాం. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఓపెనింగ్స్ ని అందుకుంటుంది. ఎలాంటి కలెక్షన్స్ ని లాంగ్ రన్ లో సొంతం చేసుకుంటుందో చూడాలి.