బాక్స్ ఆఫీస్ దగ్గర మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ జిన్నా ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి ఆడియన్స్ నుండి పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించే రేంజ్ లో టాక్ సొంతం అయింది కానీ ఇతర సినిమాల ఆప్షన్స్ వలన ఈ సినిమాను జనాలు అస్సలు పట్టించుకోలేదు అని చెప్పాలి. ఆ ఇంపాక్ట్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లియర్ గా కనిపిస్తూ ఉండగా…
సినిమా మొదటి రోజు అతి కష్టం మీద 12 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా వరల్డ్ వైడ్ గా 15 లక్షల లోపు షేర్ ని అందుకుంది. ఇక రెండో రోజు అయినా సినిమా జోరు అందుకుంటుంది అనుకుంటే అతి కష్టం మీద 10 లక్షల రేంజ్ లోనే…
షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 11 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంది. దాంతో సినిమా 2 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 26 లక్షల లోపు షేర్ ని సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ కలెక్షన్స్ లో కూడా డెఫిసిట్ లు…
నెగటివ్ షేర్స్ లాంటివి తీయకుండా చెబుతున్న కలెక్షన్స్ కాగా సినిమా ఓవరాల్ వాల్యూ బిజినెస్ 4 కోట్ల రేంజ్ లో ఉండగా అందులో పావలా వంతు కూడా వసూల్ చేయడం కష్టంగా కనిపిస్తూ ఉంది ఇప్పుడు, కానీ టాక్ కొంచం డీసెంట్ గానే ఉండటంతో దీపావళి హాలిడేస్ లో ఏమైనా గ్రోత్ ని చూపించగలుగుతుందో చూడాలి.