బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ రీ రిలీజ్ అయిన కొన్ని సినిమాలు అనుకున్న దాని కన్నా బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి…రీసెంట్ గా టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) పుట్టిన రోజు కానుకగా భారీ ఎత్తున యమదొంగ(Yamadonga4K Re Release Collections) సినిమాను రీ రిలీజ్ చేయగా…
మే 18-20 వరకు స్పెషల్ షోలను వేయాలని ఫుల్ ప్లానింగ్ చేశారు కానీ అనుకున్న రేంజ్ లో షోల అరేంజ్ మెంట్ లాంటివి సరిగ్గా కుదరలేదు…దాంతో ఇతర రీ రిలీజ్ లతో పోల్చితే ఫుల్ పొటెన్షనల్ రిలీజ్ ను యమదొంగ సినిమా అందుకోలేదు కానీ రిలీజ్ అయిన చోట కూడా…
రెస్పాన్స్ మరీ అనుకున్న రేంజ్ కి వెళ్ళలేక పోయింది. ఇది వరకు ఎన్టీఆర్ పుట్టిన రోజు టైంలో రిలీజ్ అయిన సింహాద్రి వీర లెవల్ లో కుమ్మేసింది. యమదొంగ రిలీజ్ రోజు తో కలిపి ఓవరాల్ గా 38 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా…
మొదటి రోజు ట్రాక్ చేసిన సెంటర్స్ ను బట్టి తెలుగు రాష్ట్రాల్లో 1.15 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకోగా కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి ఓవరాల్ గా 1.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని అందుకుంది…ఇక నార్త్ అమెరికాలో 11 వేల లోపే డాలర్స్ మార్క్ ని అందుకుంది…
దాంతో టోటల్ ఓవర్సీస్ గ్రాస్ తో కలిపి వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజున 1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ను మొదటి రోజున సొంతం చేసుకుంది. డీసెంట్ ఓపెనింగ్స్ అని చెప్పొచ్చు కానీ ఇతర బిగ్ స్టార్స్ బర్త్ డే టైంలో రిలీజ్ అయిన మూవీస్…
ఓపెనింగ్స్ తో పోల్చితే యమదొంగ సినిమా అంచనాలను పూర్తిగా అందుకోలేక పోయింది అనే చెప్పాలి. ఇక ఈ రోజు రేపు కూడా సినిమాకి షోలు పడుతున్నాయి కాబట్టి ఓవరాల్ గా రీ రిలీజ్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి ఇప్పుడు.