సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ యశోద…. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా పై డీసెంట్ అనిపించే విధంగా అంచనాలను పెరగగా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీగా ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి సినిమా ఎలా ఉంది, ఎంతవరకు ఆకట్టుకుని మెప్పించిందో లేదో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే… సరోగసీ కి ఒప్పుకుని ఓ బిడ్డకి జన్మ ఇవ్వడానికి సిద్ధం అయిన హీరోయిన్….
ఓ బిగ్ కార్పోరేట్ సరోగసి హాస్పిటల్ కి వెళుతుంది, అక్కడ అనుకోకుండా కొందరు అమ్మాయిలు కనిపించకుండా మాయం అయిపోతూ ఉంటారు…. దాని వెనక ఉన్న కారణం ఏంటి అనేది హీరోయిన్ ఎలా కనిపెట్టింది, ఈ క్రమంలో తను ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేసింది, ఇంతకీ వరలక్ష్మీ రోల్ ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
పెర్ఫార్మెన్స్ పరంగా సమంత తన రోల్ వరకు బాగా నటించి మెప్పించగా యాక్షన్ సీన్స్ లో కూడా మెప్పించింది, వరలక్ష్మీ రోల్ కూడా మెప్పించగా మిగిలిన యాక్టర్స్ కూడా తమ రోల్స్ వరకు బాగానే నటించి మెప్పించారు. ఫస్టాఫ్ వరకు కథ కొంచం స్లో గా స్టార్ట్ అయినా కానీ ప్రీ ఇంటర్వెల్ ను మంచి ఊపు అందుకుని ఇంటర్వెల్ వరకు గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయి సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరిగేలా చేస్తుంది.
కానీ ప్రీ ఇంటర్వెల్ నుండి పెరిగిన ఆ గ్రాఫ్ సెకెండ్ ఆఫ్ లో పడిపోయి సాదాసీదా సినిమా గా మారిపోతుంది, క్లైమాక్స్ కూడా జస్ట్ ఓకే అనిపించే విధంగా ఉంటడంతో ఫస్టాఫ్ ఇచ్చిన ఊపుని సెకెండ్ ఆఫ్ మెయిన్ టైన్ చేయలేక పోతుంది. మొత్తం మీద ఫస్టాఫ్ సూపర్బ్ గా అనిపిస్తే సెకెండ్ ఆఫ్ యావరేజ్ లా అనిపిస్తుంది… సాంగ్స్ చాలా వీక్ గా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకుంటుంది…
ఓవరాల్ గా సూపర్బ్ ఫస్టాఫ్ విత్ యావరేజ్ సెకెండ్ ఆఫ్ వలన సినిమా మొత్తం మీద పర్వాలేదు బాగుంది అనిపిస్తూ ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించినా ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు ఉన్న ఊపు సెకెండ్ ఆఫ్ లో కూడా కంటిన్యూ అయిఉంటే సినిమా రేంజ్ మరో విధంగా ఉండేది… మొత్తం మీద డిఫెరెంట్ జానర్ లో తెరకెక్కిన యశోద కొన్ని ఫ్లాస్ ఉన్నా కానీ ఈజీగా ఒకసారి చూసేయోచ్చు…. మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్…