టాలీవుడ్ లో ప్రస్తుతం బయోపిక్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే, ముందుగా సావిత్రి గారి బయోపిక్ మహానటి తెలుగు నాట అద్బుత మైన విజయాన్ని అందుకుని బయోపిక్ మూవీస్ లో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది, తర్వాత ఒక్కసారి గా బయోపిక్ ల వెల్లువ మొదలు అయ్యింది. అందులో ముందుగా స్వర్గీయ ఎన్టీఆర్ గారి బయోపిక్ మొదటి రిలీజ్ అయ్యి అంచనాలు తప్పగా ఇప్పుడు రెండో పార్ట్ పరిస్థితి అంత కన్నా షాకింగ్ గా ఉంది.
ఇదే సమయం లో పొలిటికల్ నేపధ్యం లో వచ్చిన స్వర్గీయ Y S R గారి బయోపిక్ కానీ బయోపిక్ యాత్ర రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది, ఎన్టీఆర్ బయోపిక్ సిరీస్ తో పోల్చితే యాత్ర బడ్జెట్ కానీ రేంజ్ కానీ చాలా తక్కువ.
కానీ మొదటి రోజు కలెక్షన్స్ పరంగా మాత్రం యాత్ర సాధించిన కలెక్షన్స్ ని కూడా ఎన్టీఆర్ మహానాయకుడు సినిమా అందుకోలేక చతికిల బడింది. ఇది టోటల్ టాలీవుడ్ కి దిమ్మతిరిగే షాకింగ్ న్యూస్ అని చెప్పాలి. భారీ బడ్జెట్ అండ్ భారీ స్టార్ కాస్ట్ తో వచ్చిన ఎన్టీఆర్ మహానాయకుడు…
మొదటి రోజు కేవలం 2.12 కోట్ల షేర్ ని మాత్రమె వరల్డ్ వైడ్ గా అందుకుంది, అదే సమయం లో యాత్ర తొలిరోజు వరల్డ్ వైడ్ గా లిమిటెడ్ థియేటర్స్ లోనే 3 కోట్లకు పైగా షేర్ ని రాబట్టింది. ఇక్కడే అర్ధం అవుతుంది ఎన్టీఆర్ మహానాయకుడు బాక్స్ ఆఫీస్ పరిస్థితి.
పక్క రాష్ట్ర హీరో తెలుగు లో ఎలాంటి మార్కెట్ లేకున్నా ఇక్కడ సీనియర్ స్టార్ హీరో మొదటి రోజు కలెక్షన్స్ ని మించి వసూళ్లు అందుకోవడం విశేషం. అదే సమయం లో తెలుగువారి ఆరాధ్య దైవంగా చెప్పుకునే ఎన్టీఆర్ బయోపిక్ పొలిటికల్ నేపధ్యంలో వచ్చిన ఎన్టీఆర్ మహానాయకుడు కలెక్షన్స్ ఇలా ఉండటం ఎవ్వరి ఊహలకు అందని విషయం అని చెప్పాలి.