టాలీవుడ్ లో స్ట్రైట్ మూవీస్ తో పాటు డబ్బింగ్ మూవీస్ కూడా అడపాదడపా రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ కోవలోకి లేటెస్ట్ గా జాయిన్ అయిన మరో డబ్బింగ్ మూవీ యువరత్న. కన్నడ పవర్ స్టార్ గా పేరున్న పునీత్ రాజ్ కుమార్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏప్రిల్ 1 న కన్నడ తో పాటు తెలుగు లో కూడా రిలీజ్ కాబోతుంది. కాగా సినిమా మొత్తం మీద తెలుగు లో…
సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటికి వచ్చాయి. ఒకసారి ఆ వివరాలను గమనిస్తే… సినిమా నైజాం ఏరియా లో 35 లక్షల బిజినెస్ ను సొంతం చేసుకోగా, సీడెడ్ ఏరియాలో 15 లక్షల బిజినెస్ ను సొంతం చేసుకుంది, ఇక టోటల్ ఆంధ్రాలో ఈ సినిమా…
60 లక్షల బిజినెస్ ను సొంతం చేసుకోగా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 1.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది, దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు సినిమా క్లీన్ హిట్ అవ్వాలి అంటే తెలుగు రాష్ట్రాలలో 1.5 కోట్ల రేంజ్ కి తగ్గని షేర్ ను సొంతం చేసుకోవాలి…
రీసెంట్ గా కన్నడ నుండి తెలుగు లో మరో టాప్ హీరో దర్శన్ నటించిన రాబర్ట్ వచ్చినా పెద్దగా అంచనాలను అందుకోలేదు, ఇప్పుడు మరో స్టార్ హీరో అయిన పునీత్ రాజ్ కుమార్ మొదటి సారి తన లక్ ని ఇక్కడ పరీక్షించుకోవడానికి సిద్ధం అయ్యాడు. కానీ ఈ సారి కూడా పోటి ఎక్కువగానే ఉందని చెప్పాలి.
నాగార్జున వైల్డ్ డాగ్ స్ట్రైట్ మూవీ గా 2 న రానుండగా 1 న కార్తీ నటించిన సుల్తాన్ మూవీ రిలీజ్ అవుతుంది, తెలుగు వాళ్లకి పునీత్ రాజ్ కుమార్ పేరు పెద్దగా పరిచయం లేని పేరు, అలాగే సినిమా ను ఇక్కడ పెద్దగా ప్రమోట్ కూడా చేయలేదు… మరి ఈ ఇంపాక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా ఉంటుంది, సినిమా మొత్తం మీద ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.