టాలీవుడ్ లో ఫస్ట్ మూవీ తోనే సంచలన ఎంట్రీ అందరికీ దక్కదు, కొందరికి మాత్రమే అలాంటి సక్సెస్ దక్కుతుంది, రీసెంట్ గా అలాంటి సక్సెస్ ఉప్పెన సినిమా తో పంజా వైష్ణవ్ తేజ్ కి దక్కింది. ఒకప్పుడు రామ్ చరణ్ కి కూడా దక్కగా యువ సామ్రాట్ నాగ చైతన్య కి కూడా ఆ అవకాశం ఉన్నప్పటికీ…. కథలో వెయిట్ ఎక్కువ అవ్వడంతో ఫస్ట్ మూవీ కే అలాంటి వెయిట్ ఉన్న కథ ని హ్యాండిల్ చేయక పోవడంతో సాలిడ్ ఎంట్రీ మిస్ అయ్యింది నాగ చైతన్య కి… టాలీవుడ్ లో 2009 లో జోష్ సినిమా తో ఎంట్రీ ఇచ్చిన యువ సామ్రాట్ నాగ చైతన్య తర్వాత కెరీర్ లో చాలా సినిమాలను మిస్ చేసుకున్నాడు. ఇప్పుడు కూడా కొన్ని మంచి కథలను….
తనకి సూట్ అవ్వవని, అలాగే తనకున్న కమిట్ మెంట్స్ వల్ల కూడా మిస్ చేసుకున్న నాగచైతన్య కెరీర్ లో మొదటి సారి మిస్ చేసుకున్న సినిమా కెరీర్ లో మొదటి సినిమా గా రావాల్సిన సినిమా ఒకటి ఉంది. అదే కొత్త బంగారు లోకం…
2008 లో వచ్చిన ఈ సినిమా లో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన శ్రీకాంత్ అడ్డాల డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు. కాగా కింగ్ నాగార్జున నాగ చైతన్య లాంచింగ్ భాధ్యతలను దిల్ రాజు కి అప్పగించగా తన ఏజ్ కి పెర్ఫెక్ట్ గా సూట్ అయ్యే కథ అండ్ తల్లి తండ్రుల సెంటిమెంట్ కూడా…
బాగా ఉండటం తో నాగ చైతన్య ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మొదటి సినిమాకే మంచి రీచ్ వస్తుందని భావించినా అందులో కమర్షియల్ ఎలిమెంట్స్ లేవని నాగార్జున నో చెప్పాడట. దాంతో నాగ చైతన్య ను లాంచ్ చేయాలి అనుకున్న ఈ కథను పక్కకు పెట్టి జోష్ కథను సెలెక్ట్ చేసుకోగా అందులో ఉన్న వెయిట్ ని మొదటి సినిమా కే మోయలేక పోయిన…
నాగ చైతన్య ఫస్ట్ సినిమా తో ఫ్లాఫ్ ని అందుకున్నాడు, తర్వాత లవ్ స్టొరీ ఏమాయ చేశావే తో హిట్ ని అందుకున్నాడు. ముందే కొత్త బంగారు లోకం లాంటి కథ తో ఎంట్రీ ఇచ్చి ఉంటే… నాగ చైతన్య రేంజ్ మరోలా ఉండేదేమో… అయినా ఇప్పుడు బిగ్ స్టార్ డైరెక్టర్స్ తో మూవీస్ చేయకున్నా తనకంటూ సాలిడ్ మార్కెట్ ని సృష్టించుకున్న నాగార్జున మజిలీతో 40 కోట్ల క్లబ్ లో చేరగా ఇప్పుడు లవ్ స్టొరీ తో మరో బిగ్ బ్లాక్ బస్టర్ ని సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది….