Home గాసిప్స్ ఆల్ టైం ఎపిక్ డిసాస్టర్ కి సీక్వెల్ అంట…ఈ సారి లెక్క మిస్ కాదు అంటున్న...

ఆల్ టైం ఎపిక్ డిసాస్టర్ కి సీక్వెల్ అంట…ఈ సారి లెక్క మిస్ కాదు అంటున్న YVS

7107
0

శ్రీ సీతా రాముల కళ్యాణం చూతము రారండి సినిమా తో టాలీవుడ్ లో డైరెక్టర్ గా మారిన YVS చౌదరీ తర్వాత నాగార్జున మరియు హరికృష్ణ తో సీతారామరాజు సినిమాతో దుమ్ము లేపగా తర్వాత మహేష్ తో యువరాజు యావరేజ్ గా నిలిచినా కానీ లాహిరి లాహిరి లాహిరిలో మరియు సీతయ్యా సినిమాలతో బాక్ టు బాక్ బ్లాక్ బస్టర్ సినిమాలు తీయగా తర్వాత రామ్ తో దేవదాసు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ కొట్టి…

కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న టైం లో అప్పటికీ లక్ష్మీ నరసింహా హిట్ తర్వాత మరో హిట్ కి దూరం అయిన నట సింహం నందమూరి బాలకృష్ణ తో తో YVS చౌదరీ కలిసి చేసిన సినిమా ఒక్క మగాడు. అప్పట్లో అల్టిమేట్ హైప్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా…

YVS కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండటం తో బాలయ్య కి తిరుగు లేని కంబ్యాక్ ఇస్తుంది అనుకుంటే బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం బిగ్గెస్ట్ డిసాస్టర్ మూవీస్ లో ఒకటిగా చేరింది. అలాంటి ఈ సినిమా గురించి అందులో డైలాగ్స్ కొన్ని సీన్స్ గురించి సోషల్ మీడియా లో…

అప్పుడప్పుడు ట్రోల్ అవుతూనే ఉంటుంది, కానీ ఈ సినిమా గురించి రీసెంట్ గా మాట్లాడిన YVS చౌదరీ అప్పటికి బాలయ్య సినిమా అంటే ఫాక్షన్ మూవీనే అన్నట్లు టాక్ వెళ్ళిపోయిందని, అలా కాకుండా ఫ్యామిలీ టైప్ లో ఒక యూనిక్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను తీశామని కానీ అది ఆడియన్స్ కి నచ్చలేదని, కానీ ఇప్పుడు ఈ సినిమా కి సీక్వెల్ కథని…

సిద్ధం చేసుకున్నాని, బాలయ్య ఓకే అంటే ఈ సారి టార్గెట్ అస్సలు మిస్ కాదు అంటూ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ తో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు. ఒక్క మగాడు సినిమాలో ఎక్కువ భాగం డబుల్ మీనింగ్ డైలాగ్స్ తోనే నిండిపోయినా ఫ్యామిలీ మూవీ అంటూ ఉండటం అందరినీ ఆశ్యర్యపరిచింది అనే చెప్పాలి. ఇక ఈ ఎపిక్ డిసాస్టర్ కి బాలయ్య సీక్వెల్ అంటే అస్సలు ఓకే చెప్పే అవకాశం లేదని అంతా అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here