Home న్యూస్ దేవదాసు కథ రాసుకుంది రామ్ కోసం కాదట…ఏ హీరో కోసమట!

దేవదాసు కథ రాసుకుంది రామ్ కోసం కాదట…ఏ హీరో కోసమట!

3503
0

టాలీవుడ్ డైరెక్టర్స్ లో కెరీర్ మొదలు పెట్టినప్పుడు మంచి విజయాలతో జోరు చూపి తర్వాత ఒకటి రెండు ఫ్లాఫ్స్ పడ్డా వరుస పెట్టి లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య మరియు దేవదాస్ సినిమా లతో ఒకటికి మించి ఒకటి బ్లాక్ బస్టర్ లను సొంతం చేసుకుని సత్తా చాటుకున్న డైరెక్టర్స్ YVS చౌదరీ, హరికృష్ణ కి లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య సినిమాలతో అల్టిమేట్ కంబ్యాక్ ఇచ్చిన YVS తర్వాత ఎనర్జిటిక్ స్టార్…

రామ్ ని దేవదాస్ సినిమాతో ఇండస్ట్రీ కి పరిచయం చేశాడు, ఇదే సినిమాలో ఇలియానా కూడా టాలీవుడ్ కి పరిచయం అయింది, బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ తర్వాత రెండు మూడు వారాలకు….

తిరుగులేని టాక్ ని ఆడియన్స్ లో సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది, అలాంటి ఈ సినిమా కథ ముందుగా రామ్ కోసం ఫిక్స్ చేసిన కథ కాదని వేరే హీరో ని దృష్టి లో పెట్టుకుని కథని సిద్ధం చేశానని రీసెంట్ గా…

YVS చౌదరీ సోషల్ మీడియా లో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతూ తెలియజేశాడు. దేవదాసు సినిమా కథ ని ‘నందమూరి కళ్యాణ్ రామ్ కోసం సిద్ధం చేసుకున్న కథ అని, అతనొక్కడే తర్వాత కళ్యాణ్ రామ్ ని చూసి దృష్టి లో పెట్టుకుని తన కోసం ఈ కథ ని సిద్ధం చేశాయని కానీ ఎందుకో చివరి నిమిషంలో కళ్యాణ్ రామ్ నో చెప్పడం తర్వాత…

ఆ ప్లేస్ లో రామ్ కి లాంచ్ మూవీ గా ఈ సినిమా మారిందని తెలియజేశాడు. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలవగా కళ్యాణ్ రామ్ కి ఈ సినిమా సెట్ అయ్యి ఉంటే ఎలా ఉండేదో కానీ రామ్ కి ఈ సినిమా పడటం లాంటివి కెరీర్ కి సాలిడ్ గా హెల్ప్ అయింది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here