బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న సత్యదేవ్(Satyadev) నటించిన లేటెస్ట్ మూవీ అయిన జీబ్రా(Zebra Movie 1st Day Collections) సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమాకి ఆడియన్స్ నుండి టాక్ కొంచం మిక్సుడ్ గా వచ్చింది…ఇక కలెక్షన్స్ పరంగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజున…
అనుకున్న రేంజ్ లో జోరు చూపించలేక పోయింది…ఓవర్సీస్ మార్కెట్ లో కూడా సినిమా జస్ట్ ఓకే అనిపించే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా యావరేజ్ ఓపెనింగ్స్ నే అందుకుంది అని చెప్పాలి ఇప్పుడు…
మొదటి రోజు ఇండియా లో 14 వేలకు పైగా టికెట్ సేల్స్ ను సొంతం చేసుకోగా ఓవరాల్ గా ట్రాక్ చేసిన 85-90 లక్షల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా వరల్డ్ వైడ్ గా కూడా గ్రాస్ 1.1 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా మొదటి రోజు వరల్డ్ వైడ్ షేర్…
అటూ ఇటూగా 60 లక్షల రేంజ్ లో ఉంటుందని అంచనా….తెలుగు వర్షన్ ఇందులో 55 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా మిగిలిన భాషల్లో చాలా లిమిటెడ్ షేర్ నే సాధించింది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే…
5.50 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉండగా సినిమా మొదటి రోజు సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా చాలా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సినిమా ఇక వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ తో హోల్డ్ ని చూపిస్తుందో చూడాలి…