బాక్స్ ఆఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) వాల్తేరు వీరయ్య(Waltair Veerayya) లాంటి ఎపిక్ బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన లేటెస్ట్ మూవీ భోలా శంకర్(Bholaa Shankar) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా ఆడియన్స్ నుండి మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా…
సినిమా ఏ దశలో కూడా తేరుకోలేక పోయింది. సినిమా వీకెండ్ లోనే ఏమాత్రం హోల్డ్ ని చూపించలేక పోయింది… ఇక ఓవర్సీస్ లో సినిమా ప్రదర్శన మరింతగా నిరాశ పరిచేలా ఉండగా సినిమా ఆదివారం నుండి ఓవర్సీస్ లో వస్తున్న కలెక్షన్స్ అత్యంత తీవ్రంగా నిరాశ పరిచే…
విధంగా ఉండటం ఇప్పుడు టోటల్ టాలీవుడ్ నే షాక్ కి గురి చేస్తుంది అని చెప్పాలి ఇప్పుడు. సినిమా ఆదివారం అన్ని లోకేషన్స్ లో కలిపి 16 వేల డాలర్స్ ను మాత్రమే సొంతం చేసుకోగా అన్ని ఖర్చులు తీసేస్తే షేర్ ఆల్ మోస్ట్ జీరో రేంజ్ లో ఉండగా సినిమా ఇక…
4వ రోజు మండే అమెరికాలో ఆల్ మోస్ట్ 4000 డాలర్స్ రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకుని అత్యంత దారుణంగా నిరాశ పరిచే కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఎపిక్ డిసాస్టర్ అనిపించే రేంజ్ లో నిరాశ పరిచింది అని చెప్పాలి… ఆల్ మోస్ట్ సినిమా షేర్ జీరో అనే చెప్పాలి ఇప్పుడు.
సినిమా ఏ దశలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రేంజ్ లో నిరాశ పరచడం, అది కూడా వాల్తేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇలాంటి రిజల్ట్ ను అయితే ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయనే లేదు అని చెప్పాలి. ఇలాంటి ఎపిక్ డిసాస్టర్ తర్వాత మెగాస్టార్ మమ్మోత్ కంబ్యాక్ ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.