బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సీజన్ ముగిసింది… 2 బిగ్ టాలీవుడ్ సీనియర్ హీరోల సినిమాలు రెండో వీకెండ్ వరకు వేటి రేంజ్ లో అవి కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నాయి. కానీ వర్కింగ్ డేస్ లోకి ఎంటర్ అయిన తర్వాత 2 సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న దాని కన్నా కూడా ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా వీర సింహా రెడ్డి సినిమా మాత్రం ఇంకా ఎక్కువగా డ్రాప్స్ ను….
సొంతం చేసుకుని తీవ్రంగా నిరాశ పరిచింది. చాలా సెంటర్స్ లో డెఫిసిట్ లు కూడా పడగా కృష్ణా లాంటి మేజర్ ఏరియాలో 12వ రోజు సినిమా కి షేర్ ఏమి రాలేదు… జీరో షేర్ ని సొంతం చేసుకున్న సినిమా అక్కడ తీవ్రంగా నిరాశ పరిచింది అని చెప్పాలి.
సినిమాకి అద్బుతమైన స్టార్ట్ సొంతం అవ్వగా తర్వాత పండగ సెలవులు కలిసి వచ్చి కలెక్షన్స్ చాలా మొత్తం రాగా తర్వాత సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో అయినా అప్పటికే చాలా మొత్తాన్ని వెనక్కి తీసుకు రాగా మొత్తం మీద 12వ రోజు సాధించిన…
కలెక్షన్స్ తో ఇప్పుడు బ్రేక్ ఈవెన్ ని పూర్తీ చేసుకున్నా కానీ సినిమా 12వ రోజు డ్రాప్ అయిన విధానం చూస్తూ ఉంటే పరుగు త్వరగానే పూర్తీ చేసుకునేలా ఉందని చెప్పాలి ఇప్పుడు. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని అందుకోవడంతో ఇక మీదట వచ్చేవన్నీ కూడా బోనస్ అనే చెప్పాలి…