Home న్యూస్ 3.3 కోట్ల బడ్జెట్ కి థియేట్రికల్ బిజినెస్ కాకుండా ఇంత ప్రాఫిట్ ఏంటి సామి!

3.3 కోట్ల బడ్జెట్ కి థియేట్రికల్ బిజినెస్ కాకుండా ఇంత ప్రాఫిట్ ఏంటి సామి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు లో ఇప్పటి వరకు రాని డిఫెరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న సినిమా జాంబి రెడ్డి. జాంబీల నేపధ్యంలో రూపొందిన మొదటి తెలుగు సినిమా ఇదే అవ్వగా ఆ కాన్సెప్ట్ కి కమర్షియల్ యాంగిల్ లో ఎంటర్ టైనర్ గా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమా ను తెరకెక్కించారు. ఫిబ్రవరి 5 న రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఈ సినిమా ఈ సినిమా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇంకా రివీల్ అవ్వాల్సి ఉండగా…

సినిమా సాధించిన నాన్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు మాత్రం నిర్మాతకి ఫుల్ లాభాలను దక్కించేలా చేశాయి అని చెప్పాలి. ఈ సినిమా ను మొత్తం మీద 3.3 కోట్ల రేంజ్ బడ్జెట్ లో క్వాలిటీ గా రూపొందించారట. కాగా సినిమా రీసెంట్ గా హిందీ డబ్బింగ్ రైట్స్ ముందుగా సేల్ అవ్వగా…

అక్కడే సినిమా కి 2.2 కోట్ల రేటు సొంతం అయింది. ఇక సినిమా రీసెంట్ గా తెలుగు శాటిలైట్ రైట్స్ కూడా అమ్ముడు పోగా తెలుగు రైట్స్ కి 2.3 కోట్ల రేంజ్ రేటు సొంతం అయినట్లు సమాచారం. దాంతో రెండూ కలిపే 4.5 కోట్ల రేటు ని సొంతం చేసుకున్న జాంబి రెడ్డి…

డిజిటల్ రైట్స్ అండ్ మ్యూజిక్ రైట్స్ రెండూ కలిపి 2 కోట్ల దాకా రేటుని మొత్తం మీద సొంతం చేసుకుందని అంటున్నారు. దాంతో నాన్ థియేట్రికల్ బిజినెస్ మొత్తం కలిపి 6.5 కోట్ల రేటు ని దక్కించుకోగా నిర్మాత పెట్టిన 3.3 కోట్ల రేటు కి నాన్ థియేట్రికల్ బిజినెస్ ద్వారానే మొత్తం మీద 3.2 కోట్ల మేర ప్రాఫిట్ ని నిర్మాత దక్కించుకున్నాడు. ఇక సినిమా సాధించే ప్రీ రిలీజ్ బిజినెస్…

మరింత ప్రాఫిట్ ని దక్కేలా చేస్తుంది అని చెప్పాలి. బిజినెస్ లెక్కలు ఇంకా తేలాల్సి ఉండగా మొత్తం మీద చిన్న సినిమానే అయినా మెయిన్ బిజినెస్ కాకుండానే ఇలా ప్రాఫిట్స్ ని సొంతం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి బిజినెస్ ను సాధిస్తుంది. కలెక్షన్స్ వేట ఎలా ఉంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here