బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా లెవల్ లో ఇప్పుడు అందరూ ఆశగా ఎదురు చూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్ అని చెప్పాలి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా ఎప్పటి నుండో రిలీజ్ కి సిద్ధం అవుతూ ఎదో ఒక కారణం వలన ఆగిపోతూ ఉండగా ఈ సంక్రాంతికి రావాల్సిన సినిమా…
థార్డ్ వేవ్ ఇంపాక్ట్ వలన మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు మార్చ్ 25న అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ గా భారీ లెవల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. ఇక సినిమా అమెరికాలో….
1150 కి పైగా లోకేషన్స్ లో యు కే లో 1000 కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుండగా సినిమా అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రీ సేల్స్ స్టార్ట్ అవ్వగా సెన్సేషనల్ బుకింగ్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమా అక్కడ రికార్డులను క్రియేట్ చేయడానికి సిద్ధం అవుతుంది….
ఇక సినిమా అమెరికాలో ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ ప్రీ సేల్స్ లెక్కలు ఏకంగా 1.8 మిలియన్ డాలర్స్ మార్క్ ని అందుకుని దుమ్ము లేపగా ఇంకా రిలీజ్ కి టైం ఉన్న నేపధ్యంలో మరో 700K నుండి 800K రేంజ్ లో బుకింగ్స్ జరిగే అవకాశం ఎంతైనా కనిపిస్తూ ఉంది… దీంతో సినిమా 2.5 మిలియన్ మార్క్ ని అందుకోవడం ఖాయంగా ఉండగా అమెరికాలో మొత్తం మీద ప్రీ సేల్స్ ద్వారా….
2017 టైం లో వచ్చిన బాహుబలి 2 సినిమా ఏకంగా 3 మిలియన్ డాలర్స్ ప్రీ సేల్స్ తో సంచలనం సృష్టించగా ఆ రికార్డ్ ను ఆర్ ఆర్ ఆర్ అందుకోవడానికి అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు ట్రేడ్ వర్గాలు… ఇది కనుక జరిగితే 5 ఏళ్ళుగా ఉన్న బాహుబలి 2 రికార్డ్ ఇప్పుడు బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. మరి ఓవరాల్ గా రిలీజ్ కి ముందు రోజు వరకు ఫైనల్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి…