నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ అఖండ బాక్స్ ఆఫీస్ దగ్గర పరుగును పూర్తీ చేసుకుంది, 60 రోజుల పాటు ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో రన్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బాలయ్య కెరీర్ లోనే ది బెస్ట్ అనిపించే కలెక్షన్స్ తో దుమ్ము దులిపేసింది. సినిమా ఇప్పుడు పరుగును కంప్లీట్ చేసుకోగా నైజాం ఏరియాలో సినిమా కి ఓ రేంజ్ లో ప్రాఫిట్స్ దక్కాయి అని చెప్పాలి.
సినిమాను రిలీజ్ కి ముందు ఉన్న పరిస్థితుల వలన బాలయ్య బోయపాటిలు ఫ్లాఫ్స్ ఉన్నా కానీ ఏకంగా 10.5 కోట్ల రేటు సొంతం అయింది, కానీ సినిమా ఈ ఏరియాలో ఊరమాస్ వసూళ్ళని సొంతం చేసుకుని లాంగ్ రన్ లో సెన్సేషన్ ని క్రియేట్ చేసి బిజినెస్ మీద…..
డబుల్ ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది…. టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైం కి సినిమా నైజాంలో 21.17 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా 10.5 కోట్ల బిజినెస్ మీద ఏకంగా 10.67 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని మెంటల్ మాస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది…. ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ఊచకోత కోస్తుందని ఎవ్వరూ ఊహించలేదు..