Home న్యూస్ ఫ్లాఫ్ టాక్…కానీ దంచికొడుతున్న పాగల్….కానీ!

ఫ్లాఫ్ టాక్…కానీ దంచికొడుతున్న పాగల్….కానీ!

0

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ పాగల్ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి కొందరి నుండి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినా కానీ ఎక్కువ మంది నుండి మాత్ర్రం ఫ్లాఫ్ టాక్ వినిపించింది. అయినా కానీ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని వీకెండ్ లో సొంతం చేసుకోగా ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఇక తేరుకోవడం కష్టమే అని…

అంతా అనుకున్నారు కానీ విశ్వక్ సేన్ సినిమా కు ఎంత ప్రమోషన్స్ చేయాలో అంతకి మించి చేస్తూ ప్రతీ చోటకి వెళ్లి సినిమాను ప్రమోట్ చేస్తూ ఉండటం తో సినిమా అవి సినిమా లాంగ్ రన్ కలెక్షన్స్ పై బాగానే ఇంపాక్ట్ చూపడం స్టార్ట్ అవ్వగా…

సినిమా మొదటి వీక్ తర్వాత రెండో వీక్ లో పోటి లో సినిమాలు ఉన్నప్పటికీ కూడా లిమిటెడ్ కలెక్షన్స్ నే సాధిస్తూ రన్ ని కొనసాగిస్తూ 9 రోజులు పూర్తీ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాల నుండి 4.6 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపగా…

వరల్డ్ వైడ్ గా 4.97 కోట్ల రేంజ్ లో షేర్ ని దక్కించుకుని రన్ ని కొనసాగిస్తుంది. ఇక 10 వ రోజు మరో 14 లక్షల షేర్ ని సాధించిన సినిమా ఇప్పుడు మొత్తం మీద 10 రోజులు పూర్తీ అయ్యే టైం కి తెలుగు రాష్ట్రాలలో 4.74 కోట్ల షేర్ ని వరల్డ్ వైడ్ గా 5.11 కోట్ల షేర్ ని సాధించింది. సినిమా బిజినెస్ రేంజ్ 6.1 కోట్ల రేంజ్ లో ఉందని సమాచారం.

ఆ లెక్కన బిజినెస్ ను అందుకోవాలి అంటే సినిమా మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది… బ్రేక్ ఈవెన్ కి 6.5 కోట్ల మార్క్ ని అందుకోవాలి అంటే మరో 1.4 కోట్ల రేంజ్ షేర్ ని సినిమా సొంతం చేసుకుంటే క్లీన్ హిట్ అవుతుంది. అది కొంచం కష్టమే అయినా అసాధ్యం అయితే కాదనే చెప్పాలి. మరి లాంగ్ రన్ లో సినిమా ప్రదర్శన ఎలా ఉంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here