డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ లో కొత్త పద్దతితో పే పెర్ వ్యూ లో రిలీజ్ అయిన లేటెస్ట్ మూవీస్ లో హిందీ సినిమా ఖాళీ పీలి ను ఎవ్వరూ పట్టించుకోక పోవడం తో డిసాస్టర్ రిజల్ట్ ని సొంతం చేసుకోగా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ని సాధించిన మరో సినిమా విజయ్ సేతుపతి ఐశ్వర్య రాజేష్ ల కాంబినేషన్ లో వచ్చిన వైఫ్ ఆఫ్ రణసింగం సినిమా కి రెస్పాన్స్ బాగానే వచ్చింది.
కాగా సినిమా కి మొత్తం మీద మొదటి వీకెండ్ లో 2 లక్షల 74 వేల యూనిక్ వ్యూస్ దక్కగా… తర్వాత మొదటి వారంకి వచ్చే సరికి 4.8 లక్షల దాకా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఇక సినిమా రెండో వీకెండ్ లో ఇతర సౌత్ భాషలతో పాటు హిందీ లో కూడా…
డబ్ అయ్యి సేం పే పెర్ వ్యూ పద్దతిలోనే రిలీజ్ అవ్వగా రెండో వీకెండ్ కి ఇతర భాషలు అన్నింటిలో అలాగే తమిళ్ లో మరో 1.2 లక్షల టికెట్ సేల్స్ జరిగినట్లు సమాచారం. దాంతో మొత్తం మీద సినిమా కి 10 రోజుల్లో 6 లక్షల దాకా యూనిక్ వ్యూస్ అన్నీ కలిపి….
సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ టాక్… ఒక్కో టికెట్ 199 రేటు తో 6 లక్షల వ్యూస్ అంటే సినిమా కి మొత్తం మీద 11.94 కోట్ల దాకా గ్రాస్ కలెక్షన్స్ సొంతం అయినట్లు చెబుతున్నారు… ఇందులో నిర్మాతలకు 10.2 కోట్ల దాకా చెందుతుందని జీ ప్లెక్స్ యాప్ కి మిగిలిన అమౌంట్ వెళుతుందని అంటున్నారు. ఓవరాల్ గా సినిమా కి సాలిడ్ రెస్పాన్స్ వచ్చినా కానీ…
సినిమా ని మొత్తం మీద 20 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మించడం తో సినిమా ఇప్పటి వరకు సగం వరకు మాత్రమె రికవరీ చేసిందని అంచనా వేయొచ్చు, కానీ పే పెర్ వ్యూ పద్దతి లాంగ్ రన్ ని ఎంతవరకు కొనసాగించి పెట్టిన పెట్టుబడిని టోటల్ గా రికవరీ చేస్తుందో అన్నది ఇప్పుడు డౌట్ గా మారింది…