Home న్యూస్ 25 కోట్లతో సినిమా తీస్తే….50 లక్షల షేర్….ఎపిక్ డిసాస్టర్ ఈ సినిమా!!

25 కోట్లతో సినిమా తీస్తే….50 లక్షల షేర్….ఎపిక్ డిసాస్టర్ ఈ సినిమా!!

570
0

స్టార్ కిడ్స్ మూవీస్ పై కామన్ ఆడియన్స్ లో వ్యతికేరక ఏ రేంజ్ లో ఉందో చెప్పడానికి ఇది బెస్ట్ ఉదాహరణ అని చెప్పాలి. ఆడియన్స్ మేం చూడం అంటూ సినిమాలను బాయికాట్ చేయగా ఏమి కాదులే అంటూ సినిమాను రిలీజ్ చేయడం, అందునా భారీ రేటు పెట్టి పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేయడం తో ఆడియన్స్ మరింత వ్యతిరేకంగా మారి, సినిమాను అసలు పట్టించు కొనే లేదు…

ఫలితం ఇప్పుడు అనన్య పాండే ఇషాన్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఖాళీ పీలి సినిమా కి ఆడియన్స్ నుండి ఊహకందని వ్యతిరేకత రాగా పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ అయిన ఈ సినిమా ను ఎపిక్ ఆల్ టైం డిసాస్టర్ గా డిక్లేర్ చేసేశారు.

సినిమా జీ ప్లెక్స్ లో 299 టికెట్ రేటు తో రిలీజ్ అవ్వగా సినిమా కి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినా కానీ ఆడియన్స్ అస్సలు కేర్ చేయలేదు, ఫలితం మొదటి వారం మొత్తం మీద పట్టుమని 19.5 వేల వ్యూస్ మాత్రమే సొంతం చేసుకుని డిసాస్టర్ అనిపించుకుంది. ఇక రెండో వీకెండ్ మూడు రోజుల్లో సినిమాకి…

దక్కిన వ్యూస్ వింటే షాక్ అవ్వక మానరు…. కేవలం 850 వరకు వ్యూస్ ని మాత్రమే సినిమా రెండో వీకెండ్ లో సాధించిందంట. దాంతో ఓవరాల్ గా 10 రోజుల వ్యూస్ 20.3 వేల దాకా ఉండగా 299 రేటు తో సినిమా కి 60.85 లక్షల దాకా గ్రాస్ కలెక్షన్స్ దక్కగా అందులో నుండి నిర్మాతలకు వెళ్ళే కలెక్షన్స్ మాత్రం కేవలం 50 లక్షల లోపే ఉంటాయట.

సినిమా పై మొత్తం మీద 25 కోట్ల రేంజ్ లో బడ్జెట్ ని పెట్టగా కేవలం 50 లక్షల రేంజ్ లో షేర్ ని మాత్రమే వసూల్ చేసిన ఈ సినిమా ను దారుణమైన డిసాస్టర్ గా డిక్లేర్ చేసేశారు ట్రేడ్ వర్గాలు… బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయినా పరిస్థితి వేరేలా ఉండేదేమో కానీ ఈ రిజల్ట్ మాత్రం మైండ్ బ్లాంక్ చేసిందని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here