Home గాసిప్స్ 100 సినిమాలు తీసిన డైరెక్టర్…8 ఏళ్లుగా ఆ ఒక్క సినిమా రిలీజ్ చేయలేకపోయాడు…!!

100 సినిమాలు తీసిన డైరెక్టర్…8 ఏళ్లుగా ఆ ఒక్క సినిమా రిలీజ్ చేయలేకపోయాడు…!!

0

టాలీవుడ్ లో 100 కి పైగా సినిమాలను డైరెక్ట్ చేసిన దర్శకులు అతి తక్కువ మంది మాత్రమే ఉన్నారు. వారిలో ఇప్పటికీ సినిమలు తీస్తున్న వాళ్ళు అయితే అతి తక్కువ మంది అనే చెప్పాలి, అలాంటి సీనియర్ డైరెక్టర్స్ లో సినిమాలు డైరెక్ట్ చేసినా చేయక పోయినా కానీ మంచి పేరు సొంతం చేసుకున్న దర్శకుడిగా కే రాఘవేంద్రరావు అందరి కన్నా ముందు నిలిచే డైరెక్టర్ అని చెప్పొచ్చు. బాహుబలి సిరీస్ కి అసోసియేట్ అవ్వడం…

టెలివిజన్ లో అనేక షోలు సీరియల్స్ ని రూపొందించడం లాంటివి ఇప్పటికీ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న రాఘవేంద్రరావు డైరెక్షన్ లో రూపొందిన అన్ని సినిమాలు కూడా ఆడియన్స్ ముందుకు క్రమం తప్పకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిలీజ్ అయ్యేవి కానీ ఓ సినిమా కాలేదు.

రాఘవేంద్రరావు రూపొందించిన అన్నమయ్య సినిమా మాదిరి అద్బుతమైన సంగీతంతో ఆడియన్స్ ని అలరించడానికి రూపొందించిన ఓ సినిమా ఇంటింట అన్నమయ్యా.. ఈ సినిమా ను బాహుబలి కన్నా ముందే రూపొందించిన రాఘవేంద్రరావు ఆల్ మోస్ట్ 2013 లోనే ఈ సినిమాను కంప్లీట్ చేయగా ఆ ఇయర్ ఎండ్ టైం లోనే…

సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకు రావాలని ఎంత ట్రై చేసినా కానీ రిలీజ్ కి నోచుకోలేదు ఈ సినిమా, ఫైనాన్స్ ఇబ్బందులు లాంటివి ఏమి లేవు కానీ ఎందుకో బయ్యర్స్ ఈ సినిమా పై పెద్దగా ఆసక్తి చూపలేదని, అలాగే నిర్మాతలు ఓన్ గా నైనా రిలీజ్ చేస్తారు అనుకుంటే వాళ్ళు కూడా ఆ ధైర్యం చేయలేదని అందుకే ఈ సినిమా రిలీజ్ కి…

నోచుకోలేదని అంటున్నారు. తన డైరెక్షన్ లో రూపొందిన సినిమాలు అన్నింట్లో ఈ ఒక్క సినిమానే రిలీజ్ కి నోచుకోలేదు, రాఘవేంద్రరావు గారు అనుకుంటే రిలీజ్ చేయడం పెద్ద కష్టమేమి కాదు కానీ ఎందుకనో ఈ సినిమాను కంప్లీట్ గా పక్కకు పెట్టేసి ఇతర సినిమాలతో బిజీ అయ్యారు. ప్రస్తుతం పెళ్లిసందD సినిమా ను పూర్తీ చేసిన ఈ డైరెక్టర్ పరిస్థితులు సెట్ అయ్యాక సినిమాను రిలీజ్ చేస్తారని సమాచారం..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here