టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య సినిమా రెండో వారాన్ని సూపర్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకోవడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా ఇప్పుడు 14వ రోజు సాధించే కలెక్షన్స్ తో అక్షరాలా 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకోవడానికి సిద్దం అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా 13 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 98.8 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా ఇప్పుడు…
14వ రోజు రిపబ్లిక్ డే హాలిడే అడ్వాంటేజ్ తో దుమ్ము లేపుతున్న సినిమా ఈ రోజు కలెక్షన్స్ పరంగా సాలిడ్ గ్రోత్ ని చూపిస్తూ ఉండగా సినిమాకి వైజాగ్ లో, కృష్ణా మరియు నెల్లూరు ఏరియాలలో GST రిటర్న్స్ ఈ రోజు యాడ్ కాబోతున్నాయి.
దాంతో సినిమా ఈ GST రిటర్న్స్ తో కలిపి తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 100 కోట్ల షేర్ మార్క్ ని దాటడానికి సిద్ధం అవుతూ ఉంది. ఫైనల్ గా తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి మొట్ట మొదటి సారిగా 100 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని ఎపిక్ లీగ్ లోకి ఎంటర్ అయ్యాడు అని చెప్పాలి…
ఇక సినిమా ఈ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర తిరిగి దుమ్ము లేపే అవకాశం ఉండగా రెండో వారం టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ షేర్ వసూల్ చేసిన సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా ఒకటిగా చేరబోతోంది. ఆ లెక్కలు ఏ విధంగా ఉంటాయో 2 వారాల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కల్లో తెలుస్తుంది.