బాక్స్ ఆఫీస్ దగ్గర ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన లేటెస్ట్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule) భారీ అంచనాల లాస్ట్ ఇయర్ రిలీజ్ అయ్యి ఎపిక్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి సంచలనం సృష్టించింది…అన్ని ఏరియాల్లో మాస్ ఊచకోత కోసిన ఈ సినిమా రన్ ఆల్ మోస్ట్ 50 రోజుల తర్వాత ఎండ్ ఆయింది.
తెలుగు రాష్ట్రాల్లో ఆల్ టైం రికార్డ్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మొదట్లో టార్గెట్ ను అందుకుంటుందో లేదో అన్న డౌట్స్ వచ్చినా కూడా లాంగ్ రన్ లో అంచనాలను మించి పోయిన సినిమా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో ఓవరాల్ గా టార్గెట్ ను దాటేసింది.
ఇక నైజాం ఏరియాలో సినిమా కి ఏకంగా 100 కోట్ల ఎపిక్ బిజినెస్ జరిగింది. టాలీవుడ్ చరిత్రలోనే ఇది ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ అని చెప్పాలి. కానీ సినిమా మొదటి రోజు నుండే ఊరమాస్ జోరు ని చూపించగా లాంగ్ రన్ లో అదే ట్రెండ్ ను కొనసాగించి…
ఈ మమ్మోత్ బిజినెస్ ను దాటేసింది…ఓవరాల్ గా టోటల్ రన్ కంప్లీట్ అయ్యే టైంకి సినిమా నైజాం ఏరియాలో 104.7 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకుని రన్ ని కంప్లీట్ చేసుకుంది…ఓవరాల్ గా బిజినెస్ మీద ప్రాఫిట్ 4.5 కోట్ల రేంజ్ లోనే ఉన్నపటికీ కూడా..
నైజాం లో 100 కోట్ల బిజినెస్ ను రికవరీ చేయడం అంటే చరిత్రలో నిలిచి పోయే రికార్డ్ అని చెప్పాలి. ఆ రేంజ్ లో ఈ ఏరియాలో మాస్ రచ్చ చేసిన పుష్ప2 మూవీ ఆర్ ఆర్ ఆర్ మూవీ తర్వాత నైజాం లో 100 కోట్ల షేర్ ని దాటిన సినిమాగా నిలిచింది…అల్లు అర్జున్ కెరీర్ లో ఆల్ టైం రికార్డ్ నమోదు చేసింది….
Cheppu mama kerala lo n tamilnadu lo entha vacchindhi business meeda 🤣🤣🤣
Bokka ayyindi kerala lo