ఇది వరకు అంటే సినిమాల కలెక్షన్స్ గురించి సామాన్య ఆడియన్స్ కి పెద్దగా తెలియదు, పేపర్స్ లో వేసే యాడ్స్ కానీ న్యూస్ కానీ వాటి వల్ల సినిమా కలెక్షన్స్ తెలిసేవి, రోజులు మారాయి టెక్నాలజీ పెరిగింది, ఇప్పుడు దాదాపు అన్ని సినిమాల కలెక్షన్స్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. అయినా కానీ అప్పుడప్పుడు మేకర్స్ సినిమాల కలెక్షన్స్ విషయంలో అప్పుడప్పుడు వచ్చిన కలెక్షన్స్ కన్నా కూడా ఎక్కువ కలెక్షన్స్ ని…
పోస్టర్స్ మీద వదలడం వాటిని ఫ్యాన్స్ నిజం అనుకోవడం జరుగుతూ ఉంటుంది, అది పబ్లిసిటీ కోసం, జనాలను థియేటర్స్ కి రప్పించడం కోసం చేస్తున్న పని అని ఓపెన్ గానే నిర్మాతలు చెప్పినా కానీ ఇది ఏమాత్రం ఆగడం లేదు. ఇక లేటెస్ట్ గా మలయాళ ఇండస్ట్రీ తరుపున…
ఆల్ టైం బిగ్గెస్ట్ రిలీజ్ ను రీసెంట్ గా సొంతం చేసుకున్న సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ మూవీ మరక్కార్ సినిమా పైరేట్స్ ఆఫ్ కరేబియన్ సినిమాను పోలి ఉండగా ఈ సినిమా రిలీజ్ కి ముందే నేషనల్ అవార్డును గ్రాఫిక్స్ విభావంలో సొంతం చేసుకుని సినిమాకి హైప్ తెచ్చింది.
రీసెంట్ గా సినిమా వరల్డ్ వైడ్ గా 4100 థియేటర్స్ లో మలయాళ ఇండస్ట్రీ తరుపున మరే సినిమా కూడా సొంతం చేసుకోలేని రేంజ్ రిలీజ్ ను దక్కించుకుని సంచలనం సృష్టించింది. కానీ సినిమా రిలీజ్ కన్నా ముందే పోస్టర్ లో సినిమా కి 100 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి అంటూ మేకర్స్ పోస్టర్ ను అఫీషియల్ గా రిలీజ్ చేశారు. అది జస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సినిమా కి…
వరల్డ్ వైడ్ గా 100 కోట్ల కలెక్షన్స్ దక్కాయి అంటూ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇది చూసి ట్రేడ్ మొత్తం కూడా మైండ్ బ్లాంక్ అయ్యిందని చెప్పాలి.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అడ్వాన్స్ బుకింగ్స్ తో 100 కోట్ల గ్రాస్ ను అందుకున్న మొట్ట మొదటి సినిమా అంటూ చెప్పడం చూసి అందరూ శాకవుతున్నారు అనే చెప్పాలి.