Home గాసిప్స్ భారీ మల్టీ స్టారర్ లో బాలయ్య…వర్కౌట్ అయితే 3 ఇండస్ట్రీలు షేక్ అవ్వడం ఖాయం!

భారీ మల్టీ స్టారర్ లో బాలయ్య…వర్కౌట్ అయితే 3 ఇండస్ట్రీలు షేక్ అవ్వడం ఖాయం!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ బాక్ టు బాక్ హిట్స్ తో యమ జోరు మీదున్నాడు, అఖండ సినిమాతో అల్టిమేట్ కంబ్యాక్ ని సొంతం చేసుకున్న బాలయ్య తర్వాత చేసిన వీర సింహా రెడ్డితో మరోసారి హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు అనిల్ రావిపూడితో కొత్త సినిమా చేసున్న బాలయ్య తర్వాత్ బోయపాటితో మరో సినిమా కమిట్ అయినట్లు తెలుస్తుంది.

వీటితో పాటు ఇప్పుడు బాలయ్య మరో భారీ సినిమా అవకాశం కనిపిస్తుంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ బాలయ్యతో త్వరలో ఓ భారీ మల్టీ స్టారర్ ఉండబోతుందని అనౌన్స్ చేయగా 2 పార్టులుగా ఉండే ఈ సినిమాలో మొదటి పార్ట్ లో నేను బాలయ్య అలాగే రెండో పార్ట్ లో మరో స్టార్ హీరో ఉంటారని అంటున్నాడు.

Veera Simha Reddy 17 Days WW Collections!!

ఇక రెండో పార్ట్ లో నటించే అవకాశం ఉన్న హీరోల్లో కోలివుడ్ సూపర్ స్టార్స్ రజినీ మరియు కమల్ లు మలయాళ సూపర్ స్టార్స్ మోహన్ లాల్ లేదా మమ్ముట్టి ఇలా ఎవరి డేట్స్ అందుబాటులో ఉంటే వాళ్ళు ఈ సినిమాలో జాయిన్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు ఇప్పుడు…

ఇక ప్రాజెక్ట్ ని హర్ష అనే డైరెక్టర్ హ్యాండిల్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ కథ అనుకున్నట్లు సెట్ అయితే బాలయ్యకి తెలుగు తో పాటు కన్నడలో అలాగే తమిళ్ లేదా మలయాళంలో ఇండస్ట్రీలను షేక్ చేసే అవకాశం ఎంతైనా ఉంటుందని చెప్పాలి. మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో చూడాలి.

Veera Simha Reddy 15 Days WW Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here