బాక్స్ ఆఫీస్ దగ్గర మమ్మోత్ కేజిఎఫ్ చాప్టర్ 2 మూవీ థార్డ్ వీకెండ్ లో ఎక్స్ లెంట్ ట్రెండ్ ని చూపిస్తుంది. తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 20% పైగానే గ్రోత్ ని చూపించగా సినిమా ఈ రోజు 1 కోటి రేంజ్ కి వెళ్ళే అవకాశం ఉంది. సినిమా కర్ణాటక లో ఈ రోజు 4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను, తమిళనాడులో 4 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను కేరళలో సినిమా 60 లక్షల రేంజ్ లో…
గ్రాస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా హిందీ లో ఈ రోజు 8-9 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉండగా సినిమా మొత్తం మీద ఈ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర 21 కోట్ల రేంజ్ నుండి 22 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.
ఇక వరల్డ్ వైడ్ గా సినిమా ఈ రోజు కలెక్షన్స్ తో 24 కోట్ల నుండి 25 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రోజు సాధించే కలెక్షన్స్ తో సినిమా కన్నడ ఇండస్ట్రీ లో ఎపిక్ రికార్డ్ ను నమోదు చేస్తూ 1000 కోట్ల గ్రాస్ మార్క్ ని అందుకోగా టోటల్ కలెక్షన్స్ లెక్క 1010 కోట్లకు పైగా ఉండబోతుంది. ఇక ఫైనల్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి…