Home న్యూస్ 10 రోజుల్లో రిలీజ్…..ఒక్కటి కూడా లేక పోవడం ఏంటి సామి!!

10 రోజుల్లో రిలీజ్…..ఒక్కటి కూడా లేక పోవడం ఏంటి సామి!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటించిన లేటెస్ట్ మూవీ వాంటెడ్ సినిమా అయిన సలార్(salaar part 1 – ceasefire) డిసెంబర్ 22న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా రిలీజ్ కి ఇప్పుడు పట్టుమని 10 రోజుల టైం కూడా లేదు, కానీ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ…

ఓవర్సీస్ లో ఓపెన్ అవ్వగా అక్కడ సినిమా ఆల్ మోస్ట్ 1 మిలియన్ కి పైగా గ్రాస్ ను సొంతం చేసుకుని దుమ్ము దుమారం లేపగా సినిమా యూనిట్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రమోషన్స్ లాంటివి చేయకపోవడం అందరినీ ఆశ్యర్యపరుస్తూ ఉండగా సినిమా నుండి ఇప్పటి వరకు కూడా…

ఒక్క సాంగ్ ను కూడా రిలీజ్ చేయకపోవడం అందరికీ మైండ్ బ్లాంక్ చేస్తుంది అనే చెప్పాలి. పాన్ ఇండియా మూవీ, భారీ అంచనాలు సినిమా మీద ఉండగా సినిమా మేకర్స్ ఎలాంటి ప్రమోషన్స్ ఆశించినట్లు చేయకపోవడంతో ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు…

రీసెంట్ టైంలో ఏ సినిమా విషయంలో కూడా ఒక్క సాంగ్ కూడా 10 రోజుల టైం ముందు వరకు రిలీజ్ అవ్వకుండా ఉండటం ఒక్క సలార్ విషయంలోనే జరిగింది. ఒక్క ట్రైలర్ తోనే సరిపెట్టిన మేకర్స్ మరో ట్రైలర్ ను త్వరలో రిలీజ్ చేస్తుండగా అవే సినిమా మీద బజ్ ను క్రియేట్ చేస్తాయని నమ్ముతున్నారు కానీ కేజిఎఫ్ సిరీస్ తో పోల్చితే మ్యూజిక్ పరంగా…..

సలార్ టీం నుండి ఎలాంటి అప్ డేట్స్ లేక పోవడం అందరినీ నిరాశ పరుస్తుంది అనే చెప్పాలి. ఇవి పక్కకు పెడితే సినిమా మాత్రం ఆల్ రెడీ సాలిడ్ బజ్ తో రిలీజ్ అవుతూ ఉండటంతో ఓపెనింగ్స్ పరంగా సినిమా సంచలనాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here