బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) అనిల్ రావిపూడి ల సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Movie) సినిమా రిమార్కబుల్ ట్రెండ్ ను తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా కూడా సాలిడ్ జోరుని చూపెడుతుంది…
సినిమా ఫెస్టివల్ వీక్ మొత్తం అంచనాలను మించి రాంపెజ్ ను చూపించిన తర్వాత వర్కింగ్ డేస్ లో కొంచం స్లో డౌన్ అయినా కూడా ఆల్ రెడీ అంచనాలను మించిన రాంపెజ్ ను చూపించడం విశేశం కాగా సినిమా ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో ఊహకందని లాభాలను సొంతం చేసుకుంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో 33 కోట్ల రేంజ్ లో రేటుకి వాల్యూ బిజినెస్ జరిగింది…మూడు రోజుల్లో బిజినెస్ మొత్తాన్ని రికవరీని చేసిన ఈ సినిమా తర్వాత నుండి లాభాలను సొంతం చేసుకోవడం మొదలు పెట్టగా 9 రోజులు పూర్తి అయ్యే టైంకి ఓవరాల్ గా తెలుగు రాష్ట్రాల్లో…
97.87 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 10వ రోజున సాధించిన కలెక్షన్స్ తో సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో విక్టరీ వెంకటేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ బెంచ్ మార్క్ ని సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పాలి. సినిమా 100 కోట్ల మమ్మోత్ షేర్ మార్క్ ని సొంతం చేసుకుని…
మాస్ రచ్చ చేసింది ఇప్పుడు…..ఆల్ మోస్ట్ 33 కోట్ల బిజినెస్ మీద ఏకంగా 67 కోట్లకు పైగా లాభాన్ని సొంతం చేసుకుని తెలుగు రాష్ట్రాల్లో డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. లాంగ్ రన్ లో సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఇదే రేంజ్ లో రన్ ని కొనసాగిస్తే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ రేంజ్ కి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…