Home న్యూస్ రెండో వీకెండ్ సల్మాన్ సికందర్ కి చుక్కలు కనిపించాయి సామి!!

రెండో వీకెండ్ సల్మాన్ సికందర్ కి చుక్కలు కనిపించాయి సామి!!

0

హిట్స్ కి ఫ్లాఫ్స్ కి అతీతంగా సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకునే అతి కొద్ది మంది స్టార్స్ లో ఒకరైన బాలీవుడ్ సూపర్ స్టార్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్(Salman Khan) నటించిన రీసెంట్ మూవీస్ అనుకున్న రేంజ్ లో ఇంపాక్ట్ ని ఏమి చూపించడం లేదు. ఇలాంటి టైంలో ఆడియన్స్ ముందుకు ఈ రంజాన్ కానుకగా…

సల్మాన్ నటించిన లేటెస్ట్ మూవీ సికందర్(Sikandar Movie) గ్రాండ్ గా ఎలాంటి పోటి లేకుండా భారీగా రిలీజ్ అవ్వగా సినిమా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నా కూడా చాలా నాసిరకంగా ఉండటంతో ఆడియన్స్ నుండి మిక్సుడ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక కలెక్షన్స్ పరంగా కూడా….

అతి కష్టం మీద 100 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోగా సల్మాన్ స్టార్ డం పవర్ ని చూపించినా కూడా ఎక్స్ ట్రీమ్ నెగటివ్ టాక్ ఇంపాక్ట్ వలన కలెక్షన్స్ రెండో వీక్ లో ఏమాత్రం హోల్డ్ ని చూపించ లేక పోయింది. కాగా రెండో వీకెండ్ లో ఏమైనా హోల్డ్ ని…

సినిమా చూపెడుతుంది ఏమో అనుకున్నా కూడా మినిమమ్ హోల్డ్ ని కూడా చూపించ లేక పోయిన సినిమా మూడో వీకెండ్ మొత్తం మీద కేవలం 9 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకుంది…శుక్రవారం 3 కోట్లు, శనివారం 3 కోట్లు అలాగే సండే కూడా…

కేవలం 3 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకున్న సినిమా మొత్తం మీద 9 కోట్ల రేంజ్ లోనే నెట్ కలెక్షన్స్ ని అందుకుని దారుణంగా విఫలం అయ్యింది. సినిమా ఇండియా లో డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అన్నా 240 కోట్లకు పైగా…

నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకోవాల్సి ఉంటుంది. కానీ సినిమా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే ఆ మార్క్ లో సగం క్రాస్ చేయడమే పెద్ద విషయంగా మారింది అని చెప్పాలి ఇప్పుడు. దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి సల్మాన్ సినిమాకి నిరాశ పరిచే రిజల్ట్ సొంతం అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here