Home న్యూస్ ఇస్మార్ట్ శంకర్ 10 వ రోజు కలెక్షన్స్…మాస్…ఊరమాస్!!

ఇస్మార్ట్ శంకర్ 10 వ రోజు కలెక్షన్స్…మాస్…ఊరమాస్!!

0

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ఇస్మార్ట్ శంకర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 8 రోజుల పాటు ఎలాంటి పోటి లేకుండా బాక్స్ ఆఫీస్ ను ఎలాగా, 9 వ రోజున కొత్త సినిమా డియర్ కామ్రేడ్ పోటి వలన ఆ రోజున కొద్దిగా డ్రాప్స్ ని ఎక్కువగా సొంతం చేసుకుంది, కానీ తిరిగి ఇప్పుడు 10 వ రోజున బాక్స్ ఆఫీస్ బరిలో మరోసారి మంచి కలెక్షన్స్ తో దుమ్ము లేపుతూ…

iSmart Shankar 2nd Week Theaters Count....Sensational Hold

మాస్ పవర్ ని మరో సారి చూపుతూ రోజును ఘనంగా ముగించింది ఇస్మార్ట్ శంకర్ సినిమా, సినిమా 10 వ రోజున మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల నుండి మంచి గ్రోత్ ని సాధించగా ఈవినింగ్ అండ్ నైట్ షోల సమయానికి మాస్ అండ్ క్లాస్ లో కూడా గ్రోత్ ని అందుకుంది.

దాంతో అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ కూడా ఇంప్రూవ్ అవ్వగా సినిమా 10 వ రోజున అవలీలగా 80 లక్షలకు పైగా షేర్ ని అందుకోవడం ఖాయం అయింది. ఇక సినిమా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు పూర్తిగా అందాల్సి ఉండగా అవి కూడా అనుకున్న రేంజ్ లో నే ఉంటె…

సినిమా 10 వ రోజు మొత్తం మీద 85 లక్షల నుండి 90 లక్షల లోపు షేర్ ని అందుకునే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పొచ్చు. ఇది 9 వ రోజు సాధించిన కలెక్షన్స్ తో పోల్చితే 20% కన్నా ఎక్కువ గ్రోత్ అవ్వడంతో ఆదివారం సినిమా సాలిడ్ గా కలెక్షన్స్ ని అందుకునే చాన్స్ ఉంది.

iSmart Shankar Day 7 Collections

మొత్తం మీద 10 వ రోజున సాధించే కలెక్షన్స్ తో 32 కోట్ల మార్క్ ని పూర్తీ చేసుకోబోతుంది. ఇక నిర్మాతల లెక్కల ప్రకారం 10 రోజులలో 65 కోట్ల గ్రాస్ రేంజ్ వసూళ్ళని అందుకోనుందని సమాచారం. ఓవరాల్ గా 10 రోజుల కలెక్షన్స్ లెక్కలు అఫీషియల్ గా ఎంతవరకు ఉంటాయో చూడాలి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

iSmart Shankar 7th Day Box Office Openings Report

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here