బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) రెండో వీకెండ్ లో జోరు చూపించడం స్టార్ట్ చేసింది. సినిమా 9వ రోజు అన్ని చోట్లా మంచి గ్రోత్ ని చూపించి లాభాలను పెంచుకుంటూ దూసుకు పోతూ ఉంది సినిమా ఇప్పుడు.
సినిమా ఇప్పుడు 10వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సండే అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా దుమ్ము లేపుతూ ఉండగా ఆక్యుపెన్సీ ఎక్స్ లెంట్ గానే రిపోర్ట్ అవుతూ ఉండగా, హైదరాబాదు లో ఎక్స్ లెంట్ ఆక్యుపెన్సీని సొంతం చేసుకుంటున్న సినిమా… చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పడ్డాయి
ఆంధ్ర మరియు సీడెడ్ ఏరియాల్లో 9వ రోజు మీద చాలా బెటర్ గా ట్రెండ్ ను చూపెడుతూ దూసుకు పోతుంది సినిమా…సీడెడ్ లో చిన్న చిన్న స్టేషన్స్ లో కూడా సినిమాకి ఈ రోజు మంచి ఆక్యుపెన్సీతో హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.
సినిమాకి నైజాంలో సైతం మంచి ఆక్యుపెన్సీ ఉండటంతో ఈ రోజు కలెక్షన్స్ పరంగా మంచి జోరుని చూపిస్తూ ఉండగా హిందీలో కూడా రెండో వారం స్క్రీన్ కౌంట్ తగ్గగా ముంబై, డిల్లీ అలాగే కొన్ని నార్త్ బెల్ట్ లలో మాస్ సెంటర్స్ లో సినిమాకి ఆక్యుపెన్సీ ఈ రోజు..
బాగా జోరు చూపించగా కొన్ని చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కూడా పడటం విశేషం అని చెప్పాలి…ఓవరాల్ గా మిక్సుడ్ రెస్పాన్స్ తో కూడా సినిమా ఎక్స్ లెంట్ గా జోరు చూపెడుతూ రెండో వీకెండ్ లో మాస్ రచ్చ చేస్తూ ఎన్టీఆర్ మాస్ పవర్ ను చూపెడుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.