మిక్సుడ్ రెస్పాన్స్ తో సైతం బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie)సినిమా, రెండో వీకెండ్ లో శుక్రవారం ఎక్స్ లెంట్ గా జోరు చూపించి రచ్చ చేసింది.
ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 10వ రోజు రెండో శనివారం అడ్వాంటేజ్ తో అన్ని చోట్లా ఎక్స్ లెంట్ గా జోరు చూపెడుతూ దూసుకు పోతూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఇక తేరుకునే అవకాశం కనిపించడం లేదు కానీ…
తమిళ్ లో, ఓవర్సీస్ లో మంచి జోరు ని చూపెడుతూ దూసుకు పోతున్న సినిమా 10వ రోజు మాస్ రచ్చ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. మొత్తం మీద తమిళ్ లో 10వ రోజు ఇప్పుడు సినిమా 12-13 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా….
ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు బాగుంటే కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉండగా ఓవర్సీస్ లో కూడా మంచి జోరు చూపెడుతూ ఉండగా కర్ణాటక, హిందీలో పర్వాలేదు అనిపిస్తూ ఉండటంతో సినిమా వరల్డ్ వైడ్ గా 10వ రోజున ఇప్పుడు 17-18కోట్ల రేంజ్ లో…
కలెక్షన్స్ ని అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే సినిమా కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. ఇక టోటల్ గా సినిమా 10 రోజుల్లో సాధించే కలెక్షన్స్ లెక్క ఎలా ఉంటుందో చూడాలి ఇక..