బాక్స్ ఆఫీస్ దగ్గర ఉస్తాద్ రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ది వారియర్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్సుడ్ టాక్ ని సొంతం చేసుకోగా వీకెండ్ పర్వాలేదు అనిపించినా తర్వాత వర్కింగ్ డేస్ లో చేతులు ఎత్తేసింది, రెండో వారం కొత్త సినిమాలు రిలీజ్ అయినా థియేటర్స్ ని బాగానే హోల్డ్ చేయగా కొత్త సినిమాలు డమాల్ అని పడిపోవడంతో ఉన్నంతలో మాస్ కమర్షియల్ మూవీ ఇదొక్కటే అవ్వడంతో….
బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా పర్వాలేదు అనిపించేలా రెండో వీకెండ్ లో జోరు చూపించి ఉన్నంతలో డీసెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. సినిమా 10వ రోజు 33 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకోగా 11 వ రోజు సినిమా 40 లక్షల దాకా షేర్ ని అందుకుంటుంది అనుకోగా…
సినిమా మొత్తం మీద 11వ రోజు ఆ అంచనాలను అందుకుని 44 లక్షల దాకా షేర్ ని తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 11 వ రోజు 57 లక్షల దాకా షేర్ ని అందుకోవడం విశేషం అని చెప్పాలి. ఈ కలెక్షన్స్ తో ఇప్పుడు మొత్తం మీద ది వారియర్ మూవీ….
టోటల్ గా 11 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 5.84Cr
👉Ceeded: 3.17Cr
👉UA: 2.45Cr
👉East: 1.37Cr
👉West: 1.19Cr
👉Guntur: 1.98Cr
👉Krishna: 97L
👉Nellore: 66L
AP-TG Total:- 17.63CR(27.40Cr~ Gross)
👉KA+ ROI: 1.10Cr
👉OS: 68L
👉Tamil – 1.32Cr~ est
Total World Wide: 20.73CR(35.45CR~ Gross)
మొత్తం మీద సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 38 కోట్లు కాగా సినిమా 39 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా టోటల్ గా సినిమా 11 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా క్లీన్ హిట్ కోసం ఇంకా 18.27 కోట్లు అందుకోవాల్సిన అవసరం ఉంది, అది కష్టమే అయినా నష్టాన్ని ఇంకా ఎంతవరకు కవర్ చేసుకోగలుగుతుందో చూడాలి.