బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ కలెక్షన్స్ తో రెండో వీకెండ్ ని కంప్లీట్ చేసుకున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా, బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ కలెక్షన్స్ తో సాలిడ్ లాభాలను సొంతం చేసుకుంటూ ఉండగా, వీకెండ్ లో కుమ్మేసిన తర్వాత ఇప్పుడు…
తిరిగి వర్కింగ్ డేస్ లో అడుగు పెట్టిన సినిమా అన్ని చోట్లా హెవీ డ్రాప్స్ నే సొంతం చేసుకుందని చెప్పాలి. సండే తో పోల్చితే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 11వ రోజు సోమవారం ఆల్ మోస్ట్ 70-75% రేంజ్ లో ఆన్ లైన్ టికెట్ సేల్స్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకున్న తండేల్ మూవీ…
ఆఫ్ లైన్ లో కూడా ఇదే రేంజ్ లో డ్రాప్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉండగా ఓవరాల్ గా ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తుంటే 60-70 లక్షల రేంజ్ లో షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో అందుకునే అవకాశం ఉందని చెప్పాలి. అన్ని చోట్లా ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే…
షేర్ ఇంకొంచం పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో కూడా డ్రాప్స్ గట్టిగానే ఉన్న నేపధ్యంలో సినిమా 11వ రోజున వరల్డ్ వైడ్ గా 80 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి ఇప్పుడు… ఓవరాల్ గా సినిమా…
రెండో వీకెండ్ వరకు వీర విహారం చేసినా వర్కింగ్ డేస్ లో కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకోగా ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు కనుక బాగుంటే కొంచం షేర్ లెక్క పెరిగే అవకాశం ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 11 రోజుల్లో సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.