కింగ్ నాగార్జున యువ సామ్రాట్ నాగ చైతన్య ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ బంగార్రాజు బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో కలెక్షన్స్ కోసం కొంచం కష్టపడుతుంది. సినిమా వీకెండ్స్ లో పర్వాలేదు అనిపిస్తూ ఉన్నప్పటి కీ కూడా వర్కింగ్ డేస్ లో డ్రాప్స్ హెవీగా ఉండటం 3rd వేవ్ ఇంపాక్ట్ కూడా ఉండటం లాంటివి కొంచం సినిమా కి ఎదురు దెబ్బ కొడుతున్నాయి అనే చెప్పాలి…
ఇక సినిమా పండగ సెలవుల అడ్వాంటేజ్ తో ఈజీగా బ్రేక్ ఈవెన్ అవుతుంది అనుకున్నా కానీ పైన చెప్పిన ఇంపాక్ట్స్ వలన కలెక్షన్స్ కి గండి పడింది. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నంతలో పర్వాలేదు అనిపించేలా కలెక్షన్స్ ని….
సొంతం చేసుకుంది… బంగార్రాజు 12 వ రోజు 25 లక్షల కి అటూ ఇటూగా కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు అని భావించగా సినిమా 26 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది బాక్స్ ఆఫీస్ దగ్గర. దాంతో టోటల్ గా 12 రోజుల కలెక్షన్స్ లెక్క వరల్డ్ వైడ్ గా ఈ విధంగా ఉంది…
👉Nizam: 8.01Cr
👉Ceeded: 6.43Cr
👉UA: 4.86Cr
👉East: 3.90Cr
👉West: 2.75Cr
👉Guntur: 3.27Cr
👉Krishna: 2.12Cr
👉Nellore: 1.67Cr
AP-TG Total:- 33.01CR(53.45Cr~ Gross)
👉Ka+ROI: 1.70Cr
👉OS – 1.44Cr
Total WW: 36.15CR(60.60CR~ Gross)
ఇదీ బంగార్రాజు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సాధించిన టోటల్ కలెక్షన్స్ వివరాలు… సినిమాను మొత్తం మీద…
38.15 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 39 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగగా సినిమా 12 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 2.85 కోట్ల షేర్ ని అందుకుంటేనే బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఈ రోజు రిపబ్లిక్ డే హాలిడే ఉండటంతో ఈ రోజు సినిమా జోరు చూపించే అవకాశం ఉందని చెప్పాలి. మరి సినిమా ఈ రోజు ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.