యాక్షన్ హీరో గోపీచంద్ సీటిమార్ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా సినిమా తెలుగు రాష్ట్రాలలో వీకెండ్ వరకు కుమ్మినా తర్వాత వర్కింగ్ డేస్ లో స్లో అయినట్లు అనిపించి లిమిటెడ్ డ్రాప్స్ తోనే రన్ ని కొనసాగిస్తూ వస్తుండగా రెండో వారంలో భారీ లెవల్ లో థియేటర్స్ ని హోల్డ్ చేసిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ స్టడీగానే….
సాగుతుందని చెప్పాలి…. సినిమా 10 రోజుల తర్వాత 11 వ రోజు 23 లక్షల షేర్ ని సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 వ రోజు కూడా తక్కువ డ్రాప్స్ నే సొంతం చేసుకుంది. కేవలం 5 లక్షలు మాత్రమె డ్రాప్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా…
12 వ రోజు 18 లక్షల రేంజ్ లో షేర్ ను తెలుగు రాష్ట్రాలలో సొంతం చేసుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్క ఇప్పుడు 10 కోట్ల మార్క్ ని అందుకోగా గ్రాస్ 17 కోట్ల మార్క్ ని అందుకుంది. టాలీవుడ్ లో సెకెండ్ వేవ్ తర్వాత ఇదే హైయెస్ట్ బెంచ్ మార్క్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అని చెప్పుకోవచ్చు.
ఇక సినిమా 12 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ లెక్కను ఒకసారి గమనిస్తే…
👉Nizam: 2.59Cr
👉Ceeded: 1.87Cr
👉UA: 1.35Cr
👉East: 1.00Cr
👉West: 60L
👉Guntur: 1.05Cr
👉Krishna: 58L
👉Nellore: 50L
Total AP TG: 9.54CR(16CR~ Gross)
👉KA+ROI: 38L
👉OS: 8L~(No release in USA)
TOTAL Collections: 10.00CR(17CR~ Gross)
ఇదీ సినిమా 12 రోజుల్లో సాధించిన టోటల్ కలెక్షన్స్…
సెకెండ్ వేవ్ తర్వాత 10 కోట్ల మార్క్ ని అందుకున్న మొట్ట మొదటి సినిమాగా సీటిమార్ నిలిచినా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ కి సినిమా ఇంకా 2 కోట్ల దూరంలో ఉంది… ఇంకో 10 రోజులు రోజుకి 20 లక్షల రేంజ్ షేర్ ఏమాత్రం డ్రాప్ అవ్వకుండా ఉంటేనే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అవుతుంది. మరి సినిమా ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి ఇక.