Home గాసిప్స్ 125 కోట్లు పెట్టి కొన్నారు…కొత్త కండీషన్ పెట్టిన యూనిట్!!

125 కోట్లు పెట్టి కొన్నారు…కొత్త కండీషన్ పెట్టిన యూనిట్!!

0

ప్రతీ ఏడాది మినిమమ్ మూడు కి తగ్గని సినిమాలు చేస్తూ మినిమమ్ హిట్స్ తో ఎప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా ఉండే హీరోల్లో బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ముందు నిలుస్తాడు అని చెప్పాలి. కెరీర్ లో ఆల్ టైం పీక్ టైం లో ఉన్న టైం లో కరోనా ఎఫెక్ట్ కొట్టినా కానీ తన సినిమాల పనిలో తానూ బిజీగా ఉండగా తను నటించిన సినిమాల్లో ఒకటైన…

లక్ష్మీ బాంబ్ సినిమా ను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేస్తున్నామని ప్రకటించి బాలీవుడ్ లో ఇతర సినిమాలను కూడా డైరెక్ట్ రిలీజ్ వైపు అడుగులు వేసేలా చేశాడు, ఇండియా లో హైయెస్ట్ డిజిటల్ రిలీజ్ రేటు ని సొంతం చేసుకున్న సినిమా కూడా ఇదే అవ్వడం విశేషం.

అలాంటి ఈ సినిమా ఈ పాటికే డిజిటల్ రిలీజ్ అయ్యి ఉండాల్సింది కానీ ఎక్కడో యూనిట్ కి థియేటర్స్ రీ ఓపెన్ అయితే సినిమాను అక్కడ రిలీజ్ చేయాలనీ ఆశ ఉండి డైరెక్ట్ రిలీజ్ ని హోల్డ్ చేయగా రీసెంట్ గా సినిమాను ఇక దీపావళి కి డైరెక్ట్ రిలీజ్ చేయబోతున్నామని కన్ఫాం చేశారు.

దాంతో పాటు ఒక కండీషన్ ని కూడా పెట్టి ఒప్పుకున్నారు అన్నది లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఆ టాక్ ప్రకారం థియేటర్స్ వచ్చే నెలలో రీ ఓపెన్ అయితే ఈ సినిమా రిలీజ్ టైం లో థియేటర్స్ లో కూడా రిలీజ్ చేస్తామని చెప్పారట. దానిపై డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఒప్పుకోలేదని అంటున్నా…

ఒక వారం 10 రోజులు అయినా థియేటర్స్ లో సినిమాను రిలీజ్ చేయాలని, అప్పుడే సినిమా డిజిటల్ రిలీజ్ కి ఒప్పుకుంటామని కండీషన్ పెట్టారని అంటున్నారు, దీపావళి టైం కి థియేటర్స్ తెరచుకోవడం ఖాయం కాబట్టి ఆ సీజన్ ని ఎంతో కొంత క్యాష్ చేసుకోవాలి అన్నది టీం ప్లాన్… మరి ఫైనల్ గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్ణయం ఏంటి అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here