Home న్యూస్ ఇక్కడ ఆగినా తమిళ్ లో ఆగని ఖుషి…ఇది ఎవ్వరూ ఊహించలేదు!!

ఇక్కడ ఆగినా తమిళ్ లో ఆగని ఖుషి…ఇది ఎవ్వరూ ఊహించలేదు!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర యూత్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) సమంత(Samantha) ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఖుషి(Kushi Movie) రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది కానీ తెలుగు రాష్ట్రాల్లో సినిమా…

అనుకున్న రేంజ్ లో అయితే పెర్ఫార్మ్ చేయలేదు. మొదటి వీకెండ్ లో నైజాంలో జోరు చూపించినా ఆంధ్ర సీడెడ్ లో మాత్రం స్లో అవ్వగా వర్కింగ్ డేస్ లో అన్ని చోట్లా సినిమా స్లో డౌన్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర… ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ పై క్లియర్ గా ఉండగా…

సినిమా ఓవర్సీస్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా తమిళ్ లో కూడా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని అందుకుంది… చాలా వరకు తమిళ్ డబ్ తెలుగు సినిమాలు అక్కడ అంతంత మాత్రంగానే పెర్ఫార్మ్ చేస్తాయి. అక్కడ మన సినిమాల్లో చాలా తక్కువ సినిమాలు మాత్రమే…

ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించగా ఎవ్వరూ ఊహించని విధంగా విజయ్ దేవరకొండ ఖుషి సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని అక్కడ సొంతం చేసుకుని ఇప్పటి వరకు అక్కడ 9.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది… ఈ రేంజ్ లో కలెక్షన్స్ రావడం మామూలు విషయం కాదు…

సినిమా అక్కడ మొత్తం మీద 3.75 కోట్ల రేంజ్ దాకా షేర్ ని సొంతం చేసుకుని దుమ్ము లేపింది… అక్కడ మన స్టార్ హీరోల సినిమాలే అంతంత మాత్రం కలెక్షన్స్ ని సాధిస్తుంటే ఇక్కడ పెద్దగా పెర్ఫార్మ్ చేయని ఖుషి సినిమా తమిళ్ లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము లేపడం విశేషం అని చెప్పాలి. త్వరలో 10 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here