Home న్యూస్ 12 గంటలుగా వరల్డ్ వైడ్ ట్రెండ్…ప్రభాస్ అడుగుపెడితే ఇంతేగా!

12 గంటలుగా వరల్డ్ వైడ్ ట్రెండ్…ప్రభాస్ అడుగుపెడితే ఇంతేగా!

0

పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ కల్కి 2898AD( Kalki2898AD Movie) మూవీ భారీ అంచనాల నడుమ వరల్డ్ వైడ్ గా ఈ నెల ఎండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు మేకర్స్…

ట్రైలర్ చూసిన తర్వాత సాలిడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్న సినిమాగా అనిపిస్తున్న కల్కి మూవీ ట్రైలర్ రిలీజ్ తో సోషల్ మీడియా మొత్తం ప్రభాస్ పేరు కల్కి పేరు ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతూ ఉండగా ట్రైలర్ ఒక పక్క యూట్యూబ్ లో సంచలన వ్యూస్ అండ్ లైక్స్ తో దూసుకు పోతూ ఉండగా….

మరో పక్క ట్విట్టర్ లో కూడా వరల్డ్ వైడ్ గా టాప్ ట్రెండ్స్ లో ఒకటిగా నిలుస్తూ దూసుకు పోతో ఉండటం విశేషం అని చెప్పాలి. ట్రైలర్ రిలీజ్ అయ్యి 12 గంటలు అవుతున్నా కూడా వరల్డ్ వైడ్ గా టాప్ 4 ప్లేస్ లో కల్కి హాష్ టాగ్ అలాగే టాప్ 5 ప్లేస్ లో ప్రభాస్ హాష్ టాగ్ ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి.

వరల్డ్ వైడ్ గా 12 గంటల్లో ఆల్ మోస్ట్ 350K ట్వీట్స్ పడటం విశేషం కాగా ప్రభాస్ హాష్ టాగ్ మీద ఆల్ మోస్ట్ 360K ట్వీట్స్ పడటం విశేషం..ఇండియాలో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతున్న ఈ హాష్ టాగ్స్ వరల్డ్ వైడ్ గా టాప్ 4 అండ్ టాప్ 5 ప్లేసులలో ట్రెండ్ అవుతూ ఉండటం విశేషం… ప్రభాస్ అడుగు పడిన తర్వాత సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయమని…

కల్కి మూవీ మరోసారి నిరూపించగా ట్రైలర్ కి ఆడియన్స్ నుండి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా సినిమా మీద అంచనాలు ట్రైలర్ మరింతగా పెంచేసింది అని చెప్పాలి. ఇక సినిమా కూడా ట్రైలర్ లో ఉన్నట్లు కంటెంట్ క్లిక్ అయితే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ ఖాయమని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here