బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ ఎఫెక్ట్ గట్టిగానే కనిపిస్తుంది… సెకెండ్ వీకెండ్ ని అద్బుతంగా ముగించి ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయిన లవ్ స్టొరీ బ్రేక్ ఈవెన్ కి క్లోజ్ గా వెళుతుంటే మరో పక్క లాస్ట్ వీకెండ్ లో రిలీజ్ అయిన రిపబ్లిక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో భారీగా స్లో డౌన్ అయ్యి పెద్దగా ఇంపాక్ట్ అయితే చూపడం లేదు…
రెండు సినిమాలు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డేస్ లో డ్రాప్స్ ఎక్కువగానే సొంతం చేసుకుంటూ ఉండగా ఇప్పుడు 12 వ రోజు లవ్ స్టొరీ సినిమా 11 వ రోజు తో పోల్చితే ఆల్ మోస్ట్ 35-40% డ్రాప్స్ కనిపించాయి. దాంతో ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 వ రోజు 16-20 లక్షల దాకా కలెక్షన్స్ ని అందుకోవచ్చు.
ఇక రిపబ్లిక్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 5 వ రోజు ఆల్ మోస్ట్ 50% డ్రాప్స్ ను సొంతం చేసుకుని ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కొద్ది వరకు గ్రోత్ ని సాధించినా మొత్తం మీద ఈ రోజు సినిమా 20 నుండి 25 లక్షల దాకా షేర్ ని అందుకోవచ్చు. మరి రెండు సినిమాలు ఏమైనా గ్రోత్ ని చూపెడతాయో లెదో అఫీషియల్ కలెక్షన్స్ తో తెలియనుంది.