రెండో వీకెండ్ ని ఓవరాల్ గా మంచి కలెక్షన్స్ తో కంప్లీట్ చేసుకున్న నాచురల్ స్టార్ నాని(Nani) నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం (SARIPODHAA SANIVAARAM Movie) సినిమా బ్రేక్ ఈవెన్ ని వరల్డ్ వైడ్ గా అందుకోగా తెలుగు రాష్ట్రాలలో బ్రేక్ ఈవెన్ కోసం మరికొంత కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉండగా….
12వ రోజున సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే లోకి ఎంటర్ అవ్వగా ఆల్ రెడీ బ్రేక్ ఈవెన్ ని ఓవరాల్ గా అందుకోవడంతో ఇక మీదట వచ్చేవన్నీ బోనస్ అవ్వడంతో లాభాలను ఇంకా ఎంతవరకు పెంచుకుంటుందో అన్నది ఆసక్తిగా మారింది ఇప్పుడు…..
ఇక 11వ రోజు సండేతో పోల్చితే 12వ రోజున బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కింగ్ డే వలన డ్రాప్స్ ను గట్టిగానే సొంతం చేసుకుంది. ఆల్ మోస్ట్ ట్రాక్ చేసిన సెంటర్స్ లో 70-75% రేంజ్ లో డ్రాప్స్ కనిపిస్తూ ఉండగా ఆ ఇంపాక్ట్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో కూడా ఉండే అవకాశం ఉండగా….
మొత్తం మీద ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజున తెలుగు రాష్ట్రాల్లో 42-45 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉందని చెప్పాలి, ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది.
ఇక సినిమా వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 55 లక్షల రేంజ్ కి అటూ ఇటూగా షేర్ ని అందుకోవచ్చు…ఇక మొత్తం మీద డీసెంట్ హోల్డ్ నే చూపించగా తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ కి ఇలానే స్టడీగా పర్వాలేదు అనిపిస్తే త్వరలోనే బ్రేక్ ఈవెన్ ని అందుకోవచ్చు. ఇక టోటల్ గా 12 రోజుల్లో సాధించే కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.