అన్ సీజన్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో మాస్ రచ్చ చేస్తూ దూసుకు పోతున్న యువ సామ్రాట్ అక్కి నేని నాగ చైతన్య(Naga Chaitanya) నటించిన లేటెస్ట్ మూవీ తండేల్(Thandel Movie) సినిమా, నాగ చైతన్య కెరీర్ లో ఆల్ టైం హైయెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని వీర లెవల్ లో రాంపెజ్ ను చూపించగా….
సినిమా రెండో వీకెండ్ తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా ఇప్పుడు లిమిటెడ్ డ్రాప్స్ తోనే డీసెంట్ టు గుడ్ హోల్డ్ ని చూపెడుతూ లాభాలను ఇంకా పెంచుకుంటూ ఉండటం విశేషం అని చెప్పాలి. సినిమా 11వ రోజున కొంచం ఎక్కువగానే డ్రాప్స్ ను సొంతం చేసుకున్న తర్వాత ఇప్పుడు…
బాక్స్ ఆఫీస్ దగ్గర 12వ రోజున మరోసారి వర్కింగ్ డే లో లిమిటెడ్ డ్రాప్స్ నే సొంతం చేసుకుంటూ రన్ ని కొనసాగిస్తూ ఉండగా 11వ రోజుతో పోల్చితే ఇప్పుడు 12వ రోజున తెలుగు రాష్ట్రాల్లో ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే ఓవరాల్ గా 50 లక్షల రేంజ్ నుండి అన్ని చోట్లా ఆఫ్ లైన్…
లెక్కలు కనుక బాగుంటే 55 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకునే అవకాశం ఉండగా, ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలను బట్టి కలెక్షన్స్ ఇంకొంచం అటూ ఇటూగా ఉండే అవకాశం ఉంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా బాక్స్ అఫీస్ దగ్గర ఈ రోజున…60 లక్షల రేంజ్ నుండి 65 లక్షల రేంజ్ లో..
షేర్ ని అందుకునే అవకాశం ఉండగా ఓవర్సీస్ లో ట్యూస్ డే ఆఫర్స్ లాంటివి ఏమైనా కలిసి వస్తే ఓవరాల్ గా షేర్ 70 లక్షల రేంజ్ లో ఉండే అవకాశం ఉందని చెప్పాలి. ఇక సినిమా ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర 12 రోజులు పూర్తి అయ్యే టైంకి టోటల్ వరల్డ్ వైడ్ గా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.