Home న్యూస్ 12 ఏళ్ళు….18 సినిమాలు ఫ్లాఫ్…ఇప్పుడు ఆశలన్నీ ఈ సినిమా మీదే!

12 ఏళ్ళు….18 సినిమాలు ఫ్లాఫ్…ఇప్పుడు ఆశలన్నీ ఈ సినిమా మీదే!

0

కెరీర్ మొదట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్స్ తో సాలిడ్ స్టార్ట్ ను సొంతం చేసుకున్నా కూడా తర్వాత కెరీర్ ని అనుకున్న రేంజ్ లో ప్లాన్ చేసుకోలేక ఫ్లాఫ్స్ ను దక్కించుకున్న నటులలో ఆది సాయి కుమార్(Aadi Sai Kumar) ఒకరు…కెరీర్ స్టార్టింగ్ లో ప్రేమ కావాలి మరియు లవ్ లీ లాంటి సూపర్ హిట్స్ ని అందుకుని…

యంగ్ హీరోల్లో మంచి ఫ్యూచర్ ఉంది అనిపించుకున్నప్పటికీ తర్వాత మాత్రం చేసిన సినిమాలు ఒక్కోటిగా తన మార్కెట్ ను పూర్తిగా స్లో డౌన్ చేశాయి….2012 టైంలో లవ్ లీతో హిట్ కొట్టిన తర్వాత ఇప్పటి వరకు ఆది సాయి కుమార్ ఆల్ మోస్ట్ 18 సినిమాలు చేశాడు….

సుకుమారుడు, ప్యార్ మే పడిపోయానే, గాలిపటం, రఫ్, గరం, చుట్టాలబ్బాయి, శమంతకమణి, నెక్స్ట్ నువ్వే, బుర్రకథ, జోడి, ఆపరేషన్ గోల్డ్ ఫిష్, శశి, అతిధి దేవో భవ, బ్లాక్, తీస్ మార్ ఖాన్, క్రేజీ ఫెల్లో, టాప్ గేర్, CSI సనాతాన్ అంటూ ఆల్ మోస్ట్ 18 సినిమాలు రిలీజ్ అయ్యి ఆడియన్స్ అంచనాలను అందుకోవడంలో విఫలం అయ్యాడు…

ఇలాంటి టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న టైంలో ఇప్పుడు ఆడియన్స్ ముందుకు ఆహానా పెళ్ళంట, పూలరంగడు లాంటి హిట్స్ తర్వాత వరుస ఫ్లాఫ్స్ లో ఉన్న వీర భద్రం చౌదరి డైరెక్షన్ లో సినిమా చేయనున్నాడు. వీళ్ళ కాంబోలో ఇది వరకు చుట్టాలబ్బాయి సినిమా రాగా….

ఆ సినిమా పెద్దగా అంచనాలను అందుకోలేదు….12 ఏళ్లలో 18 ఫ్లాఫ్స్ పడ్డ తర్వాత ఆది సాయి కుమార్ తిరిగి కంబ్యాక్ కోసం ట్రై చేస్తున్న టైంలో వీళ్ళ కాంబోలో రాబోతున్న కొత్త సినిమా కి కృష్ణ ఫ్రమ్ బృందావనం(Krishna From Brindavanam)టైటిల్ ను అనౌన్స్ చేశారు…. ఇక ఈ సినిమా కాంబో డీసెంట్ గానే ఉండగా ఎంతవరకు ఈ సినిమాగో ఆది కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here